»   » రూ. కోటి ఇస్తానంటూ చిరంజీవి ఊరిస్తున్నాడా?

రూ. కోటి ఇస్తానంటూ చిరంజీవి ఊరిస్తున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నచిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

ఇందులో భాగంగా 150వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ పెంచే విధంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే చాలా కథలు విన్న చిరంజీవి....మరింత బెస్ట్ స్టోరీ కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఆయన కథా రచయితలకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

తనకు పర్ ఫెక్టుగా సూటయ్యే అద్భుతమైన కథ అందిస్తే రూ. 1 కోటి పారితోషికం ఇప్పిస్తానని చెబుతున్నాడట. మరి చిరంజీవిని మెుప్పించి ఆ కోటి పారితోషికం అందుకోబోయే రచయిత ఎవరు? అనేది వేచి చూడాలి.

దర్శకుడు ఎవరు?

దర్శకుడు ఎవరు?

చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్య వివి వినాయక్ పేరు ప్రముఖంగా వినిపంచింది. ఇటీవల బోయపాటి శ్రీను పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఫ్యాన్స్ హ్యాపీ

ఫ్యాన్స్ హ్యాపీ

చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

రామ్ చరణ్ కాదా?

రామ్ చరణ్ కాదా?

ఈ చిత్రాన్ని నిర్మించ బోయేది తానే అని గతంలో రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ బాధ్యత నుండి రామ్ చరణ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. వేరొకరి చేతికి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.ఎవరు నిర్మిస్తారు? ఈ చిత్రాన్ని చిరంజీవి బావమరిదికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట.

అన్ని అంశాలతో 150వ సినిమా

అన్ని అంశాలతో 150వ సినిమా

చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పుట్టిన రోజు కానుకా?

పుట్టిన రోజు కానుకా?

ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా కానకగా అందనుందని మెగాఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

English summary
Chiranjeevi's 150th movie has become a prestigious project for the actor. The latest we hear is that he has thrown up a bumper offer to all story writers - narrate a story that would fit for his prestigious movie and take home 1 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu