twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఎవరు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు ఎట్టకేలకు దర్శకుడు ఖరారయ్యాడు. తర్జన బర్జనల అనంతరం పూరి జగన్నాథ్ అయితేనే బెటరని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలకు థియేటర్లు డెకరేషన్ చేసిన పూరి జగన్నాథ్....ఆయన్నే దర్శకత్వం వహించే అవకాశం దక్కడంపై ఆనందంగా ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆయన శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.

    ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్న సంగతి తెలిసింతే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్. ఒక వేళ ఆమె డేట్స్ దొరకకపోతే హిందీ బ్యూటీ సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట పూరి. అంజలిని సెంకడ్ హీరోయిన్ గా, చార్మిని ఐటం గర్ల్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని త్వరలో అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి.

    Ciranjeevi 150th film heroine?

    ఈ సినిమా 1940-50 కాలం నాటి బ్యాక్ డ్రాపుతో ఉంటుందిన సమాచారం. ప్రస్తుతానికి దర్శకుడు పూరి జగన్నాథ్ అనే విషయం మాత్రమే ఖరారైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పూరి దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా వస్తుందనగానే అభిమానులు కాన్ఫిడెంటుగా ఉన్నారు.

    నిన్న మొన్నటి వరకు చిరంజీవి 150వ సినిమాపై చాలా రకాల ప్రచారం జరిగింది. ఆయన సినిమా వినోదాత్మకంగా ఉంటుందని....ఇందుకోసం పూరి జగన్నాథ్ ‘ఆటో జానీ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు కూడా టాక్. అయితే ఇపుడు సినిమా బ్యాక్ డ్రాపు 1940-50 కాలం నాటిది అనే విషయం బయకు రాగానే ఇది ఎలాంటి కాన్సెప్టు అయి ఉంటుంది? స్వాతంత్రోద్యమ కాలం నాటి సంఘటనలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయా? సినిమా పూర్తి సందేశాత్మకంగా, దేశభక్తిని రేకెత్తించే విధంగా ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతోంది.

    ఇవన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చిరంజీవి పుట్టినరోజు నాటికి 150వ సినిమాకు సంబంధించి విషయాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నారు. బండ్ల గణేష్ సహనిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.

    English summary
    Film Nagar source said that, Nayanatara will play the main heroine, Anjali is likely to play the second heroine in Chiranjeevi 150th film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X