»   » చిరు 150వ చిత్రాన్ని డైలమాలో పెడుతున్నాడా...?

చిరు 150వ చిత్రాన్ని డైలమాలో పెడుతున్నాడా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో సినీ రంగ పున:ప్రవేశం చేస్తున్నాడన్న వార్తలు మెగా అభిమానులకు అత్యుత్సాహాన్ని నింపిన తియ్యటి కబురు. అయితే అభిమానులు, నిర్మాతలు, దర్శకులు, కథకలు, హీరోయిన్లు ఇలా అందరిలోనూ చర్చనీయాంశమైన చిరంజీవి మెల్లిగా తన ఇమేజిని కోల్సోతున్న ప్రమాదంలో పడుతున్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణా రాష్ట్ర విభజనంటూ డిసెంబర్ 31తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొంటాయో తెలియని పరిస్థితిలో చిరు. 2011లో తన 150వ సినిమా ప్రారంభిస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో ఊహించలేని పరిస్థితి చిరుది. అన్ని ప్రాంతాలతో పోల్చి చూస్తే తెలంగాణ ప్రాంతంలో అధిక పరిమాణంలో ఉన్న చిరు ఫ్యాన్స్ ద్వారా నష్టపోతామని గ్రహించి బయ్యర్లు కొనరేమో అన్న భయం.

ఇప్పటికే సుమారు అందరు పెద్ద దర్శకులు, కథకులుతో విపరీతమైన చర్చలు సాగించినా తుది విషయం ఏమిటన్నది సుస్పష్టంగా తేటతెల్లం కాకపోవటం అందరినీ బాధిస్తోంది. ఎటువంటి కథైతే చిరంజీవికి కరెక్టుగా నచ్చుతుంది అన్న సందేహం మీద కసరత్తులు జరిగినా ఫలితం మాత్రం కనబడుటలేదు. పవర్ ఫుల్ లాంటి కథలు కథనాలతో ఆయన ముందుకెళుతుంటే ఆయన మాత్రం ఏవేవో కాకమ్మ కథలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో, అటు దర్శకలకు ఇటు ఫ్యాన్స్ కు మళ్ళీ చిరంజీవి పై క్రేజ్ తగ్గపోతోంది..మరి తన 150 వ చిత్ర విశేషాలకు తెరదించుతాడ లేక ఇప్పట్లో ఆ ప్రసక్తే లేదంటాడో న్యూ ఇయర్ వరకూ వేచి చూడాల్సిందే...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu