»   » చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ టెలికాస్ట్ రైట్స్ అమ్మేసారట!?

చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ టెలికాస్ట్ రైట్స్ అమ్మేసారట!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 60వ పుట్టినరోజు సందర్భంగా గత కొన్ని రోజులుగా అభిమానులు వారోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో షష్ఠిపూర్తి వేడుక గ్రాండ్ గా నిర్వహించి చిరంజీవితో కేక్ కట్ చేయించాలని ప్లాన్ చేసారు ఫ్యాన్స్.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ ప్రముఖ టీవీ ఛానల్ చిరంజీవి షష్ఠి పూర్తి వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ రైట్స్ సొంతం చేసుకన్నట్లు తెలుస్తోంది. ఎక్స్ క్లూజివ్ గా టెలికాస్ట్ చేస్తున్నందుకుగాను సదరు ఛానల్ భారీ మొత్తం నిర్వాహకులకు చెల్లించినట్లు తెలుస్తోంది. చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా వివిధ ఎంటర్టెన్మెంట్ ఛానళ్లకు, న్యూస్ ఛానళ్లుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే షష్ఠి పూర్తి వేడుకలకు సంబంధించిన టెలికాస్ట్ రైట్స్ మాత్రం కేవలం ఈ ఛానల్ మాత్రమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi birthday celebrations are sold?

మరో వైపు చిరంజీవి పుట్టినరోజు వేడుక సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఆయన తనయుడు రామ్ చరణ్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ రేంజికి తగిన విధంగా ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినీ స్టార్ పుట్టినరోజు వేడుకలు ఈ రేంజిలో జరుగలేదు. మెగా అభిమానులు ఈ పుట్టిన రోజు వేడుకలను పండగలా జరుపుకుంటున్నారు.

English summary
A popular Telugu entertainment channel will be telecasting the Chiranjeevi birthday celebrations live and according to the latest buzz, the channel has paid a whopping amount to grab the exclusive telecast rights.
Please Wait while comments are loading...