For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi Balakrishna: ఊహించని ట్విస్ట్.. ఒకరికోసం ఒకరిగా చిరంజీవి-బాలకృష్ణ, ఇలా తొలిసారి!

  |

  హీరోలంటే ఫ్యాన్స్ కు అమితమైన ప్రేమ, అభిమానం ఉంటాయి. ఇక సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వారి నుంచి సినిమా వస్తుందంటే చాలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు వారి ఫ్యాన్స్. అంతేకాకుండా ఈ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే వారి అభిమానుల్లో కూడా గ్రౌండ్ లెవెల్ లో పోటీ ఉంటుందని టాక్. అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలోకి దిగనున్నారు ఈ ఇద్దరు హీరోలు. వీర సింహా రెడ్డిగా బాలయ్య బాబు వస్తుంటే వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓ క్రేజ్ న్యూస్ వైరల్ గా మారింది.

  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై..

  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై..


  మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.

   స్పెషల్ సాంగ్ తో..

  స్పెషల్ సాంగ్ తో..

  పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'వీర సింహా రెడ్డి' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా తాజాగా బావగారి మనోభావాలు స్పెషల్ సాంగ్ తో అభిమానుల్లో ఊపు తీసుకొచ్చింది.

  సంక్రాంతి కానుకగా..

  సంక్రాంతి కానుకగా..

  మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. చిరంజీవి, కేఎస్ రవీంద్ర కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో కూడా హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే మరొక కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ అలరించనున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది.

  ఊహించని ట్విస్ట్..

  ఊహించని ట్విస్ట్..

  అంటే బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు కేవలం ఒక రోజు గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగనున్నాయి. బడా హీరోలు బాలకృష్ణ, చిరంజీవికి పోటీ ఉండటంతో ఈ సంక్రాంతి రసవత్తరంగా ఉండనుంది. అయితే ఏ హీరో సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో.. ఎలాంటి టాక్ వస్తుందో సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉందంటున్నాయి సినీ వర్గాలు.

  వార్ ఉండకుండా..

  వార్ ఉండకుండా..


  ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్య, అటు బాలకృష్ణ వీర సింహా రెడ్డి రెండు సినిమాలను నిర్మించింది ఒకే ఒక్క బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి రెండు పెద్ద సినిమాలో విడుద కావడం ఇదే తొలిసారి. అయితే చిరంజీవికి బాలకృష్ణకు బాక్స్ ఆఫీస్ వార్ ఎప్పటినుంచో ఉంటుందని సినీ వర్గాల మాట. ఈసారి కూడా అలా వార్ ఉండకుండా మైత్రీ మూవీ మేకర్స్ ఒక ప్లాన్ వేసిందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

  ముఖ్య అతిథిగా చిరు..

  ముఖ్య అతిథిగా చిరు..


  బాలకృష్ణ వీర సింహా రెడ్డి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో జనవరి 6న నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చిరుని మైత్రీ మూవీ మేకర్స్ అడగ్గా వెంటనే ఒప్పేసుకున్నట్లు భోగట్టా. అలాగే వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణను అతిథిగా పిలిచే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

  చిరు బాలయ్య కాంబినేషన్ లో..

  చిరు బాలయ్య కాంబినేషన్ లో..

  ఇలా బడా హీరోలు ఒకరి ఫంక్షన్ కు మరొకరు వెళ్లి తమ సినిమాలను ప్రమోట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేశారని మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది గనుక నిజమైతే ఇద్దరు హీరోల అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుడికి కూడా హైఓల్టేజ్ కిక్ ఇచ్చినట్లే అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

  English summary
  Mythri Movie Makers Plan To Invite Megastar Chiranjeevi As Special Guest For Nandamuri Balakrishna Gopichand Malineni Combination Movie Veera Simha Reddy Pre Release Event At Ongole on January 12
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X