»   » అంతా సిద్దం: పుట్టిన రోజునే...చిరు సినిమా ప్రకటన

అంతా సిద్దం: పుట్టిన రోజునే...చిరు సినిమా ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఆయన పుట్టిన రోజున అంటే ఆగస్టు 22 న ఈ చిత్రం ప్రారంభం జరగనుందని సమాచారం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన 150 వ చిత్రం గురించి ఎన్నో కథలు,కథనాలు మీడియాలో వచ్చాయి...వస్తూనే ఉన్నాయి. వేటికీ చిరంజీవి అవుననలేదు...కాదనలేదు. ఆయన మాత్రం తన శరీరాన్ని సినిమాకు తగినట్లు మార్చుకునే పనిలో పడిపోయారు. అదే స్పీడులో స్క్రిప్టుని సైతం ఓకే చేసి రోజూ ఆ స్క్రిప్టు పై కూర్చుంటున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందుతున్న సమాచారం ప్రకారం... చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తారి. అందుకే 'ఆటోజానీ' టైటిల్‌ను పూరి రిజిస్టర్‌ చేయించారు. ఈ కథను ప్రముఖ రచయిత బీవీఎస్‌ రవి అందిస్తారు. గత కొంతకాలంగా ఈ కథపై చిరు, పూరి, రవి కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు కథ పూర్తిస్థాయిలో సిద్ధమైందట.

Chiranjeevi Confirms BVS Ravi Grand Script for 150th Film

ప్రస్తుతం పూరి 'జ్యోతిలక్ష్మీ' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తరవాత వరుణ్‌తేజ్‌తో ఓ చిత్రాన్ని మొదలెడతారు. వరుణ్‌ సినిమా పూర్తయ్యాకే చిరు సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. ఈ లోగా అంటే...ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు 150వ చిత్రం ప్రారంభం జరుగుతుంది. తర్వత షెడ్యూల్ చూసుకుని ... కంటిన్యూ షూటింగ్ పెట్టుకుంటారు.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి 60వ జన్మదిన వేడుకలను ఆగస్టు 22న ఘనంగా నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు స్వామినాయుడు చెప్పారు. చిరంజీవి యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమిరిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో చిరంజీవి యువత, అభిమాన సంఘాల ముఖ్య నేతల సమావేశం జరిగింది.

ఆగస్టు 2న హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల ముఖ్య పట్టణాల్లో చిరంజీవి జన్మదిన వేడుకలను ప్రారంభించాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో పాటలు, నృత్య పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

English summary
Megastar fans who is excitedly holding up for Chiranjeevi 150th film.the script for the film is carried out by the acclaimed essayist BVS Ravi.
Please Wait while comments are loading...