»   » శ్రీజ పెళ్లి జైపూర్‌లో కాదు..ఛానెళ్లుకూ ట్విస్ట్

శ్రీజ పెళ్లి జైపూర్‌లో కాదు..ఛానెళ్లుకూ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం ఎప్పుడు, ఎక్కడ అనే విశేషాలకు కోసం చిరు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి కుటుంబం కూడా ఈ విషయమై క్లారిటీ రాలేదట. వారు ఇంకా ఏ విషయమూ డిసైడ్ చేసుకోలేదని తెలుస్తోంది.

మొదట ఈ కుటుంబం జైపూర్ లోని ప్యాలెస్ లో డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసారు. ఇప్పుడు ట్రెండీగా మారిన ఈ మ్యారేజ్ కాన్సెప్టు కోసం ఓ నాలుగు రోజులు ముందే వెళ్లి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడా ఐడియాను డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

చిరంజీవికి కాబోయే అల్లుడిపై షాకింగ్ రూమర్స్?

రీసెంట్ గా ఉదయ్ పూర్ కు రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత వెళ్లి వచ్చారట. అయితే అక్కడ చాలా వేడిగా ఉండటం గమనించారట. దాంతో వెంటనే ప్లాన్స్ ఛేంజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు చల్లగా ఉండే వెన్యూ కోసం సెర్చింగ్ మొదలైంది.

Chiranjeevi hunts for a best venue

విజ్ క్రాప్ట్ అనే మ్యారేజ్ ఈవెంట్ సంస్ద వారు ఈ విషయమై వారికి చాలా ఆప్షన్స్ ఇస్తున్నారట. మరి కొద్ది రోజుల్లో వారిచ్చిన ఆప్షన్స్ పరిశీలించి బెస్ట్ అనుకున్న దానిలో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నార్ట.

ఎక్సక్లూజివ్: శ్రీజను చేసుకోబోయే కళ్యాణ్ ఇతనే(రేర్ ఫొటోలు)

మార్చి 28న అతికొద్ది మంది సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం నిర్వహించున్నారని చిరు సన్నిహితుల సమాచారం. వివాహానికి కొద్ది రోజుల ముందు సన్నిహితులు..కుటుంబసభ‌్యులు వెన్యూకు వెళ్లనున్నట్టు సమాచారం.

మరో ప్రక్క ...శ్రీజ పెళ్లి కోసం అభిమానులే కాదు పలు టీవి ఛానెళ్ళు కూడా పోటి పడుతున్నాయి. లైవ్ కవరేజ్ కోసం హక్కులు పొందేందుకు మెగా ఫ్యామిలీపై కాప్త ఒత్తిడి తెస్తుండగా, బయటనుండే కవర్ చేసుకోమని వారు చెప్పినట్టు తెలుస్తోంది.

English summary
Chiranjeevi family had considered Udaipur and Jaipur, but Ram Charan, Upasana and Chiranjeevi’s elder daughter Susmitha visited these places and found them too hot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu