»   » నిజమా?...బ్రహ్మానందంను చిరంజీవి వద్దన్నాడా?

నిజమా?...బ్రహ్మానందంను చిరంజీవి వద్దన్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్వరలో రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నసంగతి తెలిసిందే. అయితే ఈచిత్రంలో ప్రముఖ తెలుగు కమెడియన్ బ్రహ్మానందం నటించే అవకాశం లేదని, ఒక వేళ ఉన్నా అతని పాత్ర పరిమితంగానే ఉంటుందని అంటున్నారు. శ్రీను వైట్ల గత హిట్ సినిమాలై ఢీ, రెడీ, దూకుడు, బాద్షా చితాలు బ్రహ్మానందం వల్లనే హిట్టయ్యాయనే వాదన ఉంది. అయితే తాజా సినిమాలో క్రెడిట్ మొత్తం రామ్ చరణ్‌కే వచ్చేలా ప్లాన్ చేయాలని, బ్రహ్మానందం పాత్ర నిడివి తగ్దించాలని, వీలైతే అతను లేకుండానే సినిమా తీచాలని సూచించారట చిరంజీవి. ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. మరి నిజంగానే చిరంజీవి ఇలాంటి సూచన చేసారా? లేక పుకారు మాత్రమేనా? అనేది తేలాల్సి ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

త్వరలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ చిత్రంలో ఐటం సాంగు కోసం హీరోయిన్ అంజలిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట శ్రీను వైట్ల. ఈ మేరకు ఆమెను సంప్రదించగా రూ. కోటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. హీరోయిన్ తో సమానంగా అమ్మడు ఐటం సాంగుకు డిమాండ్ చేయడంతో అంతా షాకయ్యారట. రెమ్యూనరేషన్ తగ్గించాలని సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలో ఏ విషయం అనేది తేలనుంది.

Chiranjeevi no to Brahmanandham !

ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, త్వరలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మరో వైపు గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవలే ‘రేసు గుర్రం' సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి రామ్ చరణ్ కోసం అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ - శ్రీను వైట్ల సినిమా, సురేందర్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న ‘కిక్ 2' సినిమా పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary
Dhee, Ready, Dookudu, Baadshah .. all these films of Srinu Vaitla have significant comedy tracks of Brahmanandham. Significant is a very small word as the ace comedian overshadowed the main leads of those films and became the success secret of the films and as well as Srinu Vaitla. However Chiranjeevi reportedly instructed that he do not want Brahmanandham in Vaitla's next with Ram Charan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu