»   » చిరంజీవి 150 చిత్రంపై కొత్త రూమర్

చిరంజీవి 150 చిత్రంపై కొత్త రూమర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 150 వ చిత్రం ప్రకటించేదాకా మీడియాలో, అభిమానుల్లో ఇదే పెద్ద చర్చనీయాంశంగా ఉంటోంది. ఎక్కడ ఏ సినిమా రిలీజై హిట్టైనా దాని రైట్స్ తీసుకుని చిరంజీవి సినిమా చేసేస్తారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా అలాంటి రూమర్ ఒకటి గత కొద్ది రోజులు గా తమిళ సిని వర్గాలో మొదలైంది.

చిరంజీవి దృష్టి రీసెంట్ గా అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాలం' కన్నుపడిందని, ఈ మేరకు ఆయన ఆ నిర్మాతను స్పెషల్ షో వేయమని చెప్పనట్లు అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన 150 వ చిత్రంగా ఈ రీమేక్ ఎలా ఉంటుందని తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

vedalam

ఇక ‘వేదాలం' విషయానికి వస్తే... ఈ చిత్రం కేవలం అజిత్ కు ఉన్న క్రేజ్ తో భారీ ఓపినింగ్స్ తెచ్చుకుని నిలబడ్డ చిత్రం. ఈ చిత్రం రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలతో, చెల్లి సెంటిమెంట్ తో సాగే చిత్రం అని అక్క్డడ రివ్యూలు తేల్చేసాయి. అయితే ఓపినింగ్ రోజే దాదాపు ముప్పై కోట్లదాకా కలెక్షన్స్ రాబట్టిందని వినికిడి. ఈ స్ధాయిలో విజయవంతం అవటమే చిరంజీవి దృష్టి ఈ సినిమాపై పడటానికి కారణమైందని అంటున్నారు.

ఇంతకు ముందు కూడా చిరంజీవి... విజయ్ హీరోగా వచ్చిన కత్తి చిత్రం రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఈ నేపధ్యంలో ఇది కేవలం రూమరా లేక నిజంగానే చిరంజీవి ఈ సబ్జెక్టు పై సీరియస్ గా ఉన్నాడా అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary
Chiru is planning to choose “Vedalam” movie remake as his comeback 150th film, even megastar requested for special screening of this movie to finalize on the same.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu