Mega 154లో మెగాస్టార్ పాత్రకి మాస్ టైటిల్.. హింట్ ఇచ్చారు కానీ గుర్తు పట్టలేరు!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఆయన చేసిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. వాటిలో డైరెక్టర్ బాబీతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ఇదే అంటూ తాజాగా ఒక పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఆ పేరు కాస్త వింతగా ఉండడంతో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

కరోనా కారణంగా
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తన చిరకాల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమా పూర్తి చేసిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అంతకంతకు వాయిదా పడుతూ వస్తోంది.

మరో నాలుగు సినిమాలు
ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుండగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదళం రీమేక్ 'భోళా శంకర్'. బాబీ దర్శకత్వంలో తన 154వ సినిమా అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా కూడా లైన్ లో పెట్టారు.

ఆసక్తికర ప్రచారం
ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేస్తూ తాను ఖాళీగా లేకుండా వరుస సినిమాలు చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలోనే ఇప్పుడు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి టైటిల్ బయటకు రాకుండా చూసుకున్నారు.

పూనకాలు లోడింగ్ అంటూ
అయితే ఈ సినిమాకు వాల్తేరు వీర్రాజు అనే పేరు ఫిక్స్ చేసే అవకాశం ఉందని, ఇది మత్స్యకారుల కధ అని, సినిమాలో ఆయన ఒక జాలరి పాత్రలో నటించే అవకాశం ఉందని కూడా ఆమధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు పూనకాలు అని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే సమయంలో పూనకాలు లోడింగ్ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

పూనకాలు
అయితే అది సినిమాలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ అయి ఉంటుంది అని ఎవరూ ఊహించి ఉండరు. ఇక చిరు పేరు పూనకాలు అయితే టైటిల్ కూడా అదే అయి ఉంటుందని అంటున్నారు. కానీ ఆ విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీకే మోహన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటనతో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











