»   » చిరంజీవి గెస్ట్ రోల్....నిజమేనా?

చిరంజీవి గెస్ట్ రోల్....నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ లో కనపడుతున్నారనే సంగతి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆయన గెస్ట్ గా కనపడేది రామ్ చరణ్, శ్రీను వైట్ల చిత్రంలో అని చెప్పుకుంటున్నారు. ఆ చిత్రంలో ఓ కీ రోల్ లో ఓ స్టార్ హీరో కనపడాలని తెలుస్తోంది. అయితే ఎవరు కనపడితే బాగుంటుందనే అంచనాలు వేసి, చివరకు చిరంజీవి ఉంటే బాగుంటుందని రామ్ చరణ్ అన్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అయితే ఇది నిజమా కాదా అన్న విషయం తెలియటం లేదు. ఎందుకంటే చిరంజీవి తన 150 చిత్రానికి ప్రస్తుతం ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మరో చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారా అనేది సందేహమే అంటున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఓ ఫైట్ సీన్,ఓ పాట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమైతే అభిమానులకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది.

చిత్రం విశేషాలకు వస్తే...

రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల చేస్తామని మొదట రోజే ప్రకటించారు. అందుకు అణుగుణంగా రెగ్యులర్ షూటింగ్ లో నో గ్యాప్ అన్నట్లు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో విడుదల తేదీ గురించి తమన్ ఓ ట్వీట్ చేసారు.

Chiranjeevi’s special role in Ram Charan-Srinu Vaitla’s movie!

తమన్ చెప్తున్న దాని ప్రకారం సెప్టెంబర్ మిడిల్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ రషెస్ మరియు టీం స్పీడ్ చూసిన తమన్ సినిమా చాలా బాగా వస్తోందని తెలిపాడు.

ప్రస్తుతం రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ...స్టంట్ మ్యాన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలకు పనిచేసే ఆ స్టంట్ మ్యాన్ తన వృత్తిలో భాగంగా ...అప్పటికే హీరోగా చేస్తున్న బ్రహ్మాజీకి బాడీ డబుల్ గా కనపడి...ఫైట్స్ చేస్తాడన్నమాట. ఈ సీన్స్ ని రీసెంట్ గా శ్రీను వైట్ల చిత్రీకరించారు.

ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
If the ongoing buzz is to be believed, Megastar Chiranjeevi will be seen in a key role in Ram Charan Tej, Srinu Vytla movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu