»   » మ్యాటర్ ఫైనల్ :ఆ రీమేక్ తోనే ...చిరు 150 చిత్రం

మ్యాటర్ ఫైనల్ :ఆ రీమేక్ తోనే ...చిరు 150 చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 150వ చిత్రం గురించి చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిరంజీవి ఏ కథని ఫైనలైజ్ చేయటం లేదు. తనకు తగ్గ కథ కోసం ఆయన చాలా కాలంగా వెతుకుతున్నారు. కానీ ఏదీ ఫైనలైజ్ చేయటం లేదు. తాజాగా ఆయన ఓ కథని ఫైనలైజ్ చేసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం. అది మరేదో కాదు కత్తి చిత్రం రీమేక్ అని తెలుస్తోంది.

రీసెంట్ గా కత్తి చిత్రం చూసిన చిరంజీవి ఆ రీమేక్ ని కొద్ది పాటి మార్పులతో చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. తెలుగు నేటివిటీ కోసం మార్పులు చేయమని పరుచూరి బ్రదర్శ్ కు పురమాయించినట్లు చెప్తున్నారు. వారు మార్పులు తో చేసిన స్క్రిప్టు విని నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో చిరంజీవి ఉన్నట్లు చెప్తున్నారు.

విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా కాలాంగా ఊరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చూసి రీమేక్ కు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయమై కాపీ రైట్ కేసు ఉండటంతో ఆగిపోయిందని వినికిడి. అయితే ఇప్పుడు అవన్నీ క్లియర్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

Chiranjeevi Settles For Kaththi Remake

ఇంతకు ముందు..

నాకు పూరి జగన్నాథ్ నేరేట్ చేసిన కథ సెకండాఫ్ నచ్చలేదు ," అంటూ చిరంజీవి తన 150 వ చిత్రం గురించి చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఆయన తెలుగులో ఓ లీడింగ్ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఓ మూడు నెలల లోపు స్క్రిప్టుని ఫైనలైజ్ చేసి పట్టాలు ఎక్కిస్తామనే ధీమాగా ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి, పూరి కాంబినేషన్ లో ఆటో జాని చిత్రం వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి ఇలా చెప్పి దానికి అడ్డుకట్ట వేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిరంజీవి అభిమానులు అంతా చిరంజీవి ఈ చిత్రం ప్రకటన వస్తుందని భావించారు. ఈ నేపధ్యంలో ఆయన ఇలా బాంబు పేల్చారు. కత్తి రీమేక్ ని వివి వినాయిక్ తోనే చిరంజీవి ముందుకు వెళ్తాడని చెప్పుకుంటున్నారు.

Chiranjeevi Settles For Kaththi Remake

అందుతున్న సమాచారాన్ని బట్టి చిరంజీవి తన 150వ మెసేజ్ ఓరియెంటెడ్ లాగ కాకుండా ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూడాలనకుంటున్నారని, అది లాండ్ మార్క్ గా నిలిచిపోయేలే చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి అంచనాల మేరకు ఏ స్క్రిప్టు ఓకే కాకపోవటంతో ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తారు...చిరంజీవి గారి సతీమణి సురేఖ సమర్పిస్తారు. మరో ప్రక్క చిరంజీవి ఈలోగా రామ్ చరణ్ తాజా చిత్రం మెరుపులో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

కాపీ సమస్య...

ఈ భారీ చిత్రం తమ కథనే కాపీ కొట్టి తీసారంటూ తిరువల్లూరు కి చెందిన మింజూర్ అనే వ్యక్తి కేసు వేసారు. తను రూపొందిస్తున్న మూత కుడై అనే చిత్రం కథనే తస్కరించాడంటూ కత్తి చిత్రం రిలీజ్ ని ఆపాలంటూ కోర్టులో పిటీషన్ వేసాడు. అయితే ఈ విషయమై మురుగదాస్ వెంటనే స్పందించారు. తనకు అసలు మింజూర్ అనే వ్యక్తి ఎవరో తెలియదని, కేవలం ఇవన్నీ జనం అటెన్షన్ ని గ్రాబ్ చేయటానికి చేస్తున్న ట్రిక్ అనే కొట్టిపారేసారు.

మరో కేసు..

Chiranjeevi Settles For Kaththi Remake

చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన కత్తి చిత్రం గత ఏడాది విడుదలైంది. ఈ చిత్రం కథ తాను దర్శకత్వం వహించిన భూమి అనే డాక్యుమెంటరీ కథాంశం అని, తన కథను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చోరీ చేసినట్లు, ఇందుకు నష్ట పరిహారం చెల్లించాలని, వేరే భాషల్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసేందుకు స్టే విధిం చాలని తిరుకాట్టుపల్లి సమీపంలోగల ఇలంగాడు గ్రామం దిగువ వీధికి చెందిన అన్బువ రాజశేఖర్ (32) తంజావూరు జిల్లా సెషన్సు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటు డు విజయ్, నిర్మాతలు కరుణాకరన్, సుభాష్‌కరన్, చాయాగ్రాహకుడు జార్జి విలియమ్ అనే ఐదుగురిపై నేరం ఆరోపించారు.

English summary
If the reports are to be believed, Chiranjeevi has zeroed in on Kaththi remake. Though there are few changes to be made in the script to suit the Telugu nativity, the Vijay starrer has impressed the Megastar and the official announcement on this is expected in a week or two.
Please Wait while comments are loading...