For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం: ఆ మూవీ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. ఏకంగా మూడో స్టార్ లైన్‌లోకి!

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత వేగం పెంచిన ఆయన.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా హీరో.. ప్రస్తుతం మెగా మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటించారు. తాజాగా అందులో ఒక మూవీ విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆ వివరాలేంటో చూడండి!

  మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ‘ఆచార్య'

  మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ‘ఆచార్య'

  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. దేవాదాయ భూముల స్కా నేపథ్యంతో ఇది రూపొందుతోంది. ఇందులో చిరు సరసన కాజల్.. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం ఇస్తున్నాడు.

  ‘లూసీఫర్' రీమేక్‌‌కు సిద్ధమైన చిరంజీవి

  ‘లూసీఫర్' రీమేక్‌‌కు సిద్ధమైన చిరంజీవి

  ‘ఆచార్య' షూటింగ్ జరుగుతోన్న సమయంలో సమయంలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వివరించారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘లూసీఫర్' రీమేక్ ఒకటి. అక్కడ మోహన్ లాల్ నటించిన ఈ సినిమాను చిరు రీమేక్ చేయబోతున్నారు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ యాక్షన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

  ప్రభాస్ డైరెక్టర్ నుంచి కోలీవుడ్ డైరెక్టర్

  ప్రభాస్ డైరెక్టర్ నుంచి కోలీవుడ్ డైరెక్టర్

  ‘లూసీఫర్' తెలుగు రీమేక్‌ను.. ప్రభాస్‌తో ‘సాహో' తీసిన సుజిత్ తెరకెక్కిస్తాడని చిరంజీవి ప్రకటించారు. ఆ తర్వాత ఈ స్క్రిప్టుపై అతడు చేసిన పని వర్కౌట్ కాకపోవడంతో దీని నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను దర్శకుడిగా ఎంపిక చేశాడు చిరంజీవి. ‘హనుమాన్ జంక్షన్' తర్వాత మరోసారి అతడు తెలుగులో సినిమాకు సిగ్నల్ ఇచ్చాడు.

  అప్పటి నుంచి ఆ పనిలో ఉన్న మోహన్

  అప్పటి నుంచి ఆ పనిలో ఉన్న మోహన్

  మోహన్ రాజా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ‘లూసీఫర్' స్క్రిప్టుపై వర్క్ చేయడం మొదలు పెట్టాడు. మలయాళం పరిస్థితులకు తగ్గ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్న అతడు.. దీని కోసం ఎన్నో సీన్లను కట్ చేసినట్లు ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా అందులో లేని హీరోయిన్‌ పాత్రను ఇందులో యాడ్ చేయడంతో పాటు కమర్షియల్ అంశాలను జోడించాడట.

  మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం

  మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం

  ‘లూసీఫర్' రీమేక్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఇది పూర్తయింది. ఇక, ఈ మూవీ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అప్పుడు చెప్పారు. కరోనా ప్రభావం లేకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం అయి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

  ఆ మూవీ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. కారణం

  ఆ మూవీ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. కారణం

  ‘లూసీఫర్' రీమేక్ షూటింగ్ కొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుంది అనగా.. ఈ సినిమా నుంచి దర్శకుడు మోహన్ రాజాను తప్పించాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. కావాల్సినంత సమయం ఇచ్చినా సంతృప్తి పరిచేలా స్క్రిప్టును మార్పులు చేయకపోవడం వల్లే ఆయన ఇలా డిసైడ్ అయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది.

  Ravi Teja Replaces Chiranjeevi In Puri Jagannadh's Auto Jaani || Filmibeat Telugu
  ఏకంగా మూడో స్టార్ లైన్‌లోకి.. ఎవరు?

  ఏకంగా మూడో స్టార్ లైన్‌లోకి.. ఎవరు?

  ఈ రీమేక్ సినిమా నుంచి ఇప్పటికే సుజిత్ తప్పుకున్నాడు. ఇప్పుడేమో మోహన్ రాజాను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, మరో డైరెక్టర్‌ను కూడా ఎంపిక చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు స్టార్ డైరెక్టర్లు పని చేసినట్లు అవుతుంది. చూడాలి మరి ఈ వార్తలో ఎంత నిజముందో.

  English summary
  Chiranjeevi is currently shooting for Koratala Siva’s ‘Acharya’ as well. The regular shoot ‘Lucifer’ will start in March. Chiranjeevi and Nayanthara had earlier acted together as husband and wife in ‘Sye Raa Narasimha Reddy’. More.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X