For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాన్ ఇండియన్ డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా: అప్పుడలా మిస్సైంది.. ఇప్పుడు మాత్రం పక్కా ప్లాన్‌తో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ కాలం పాటు సినిమాల్లో సత్తా చాటిన ఆయన.. రాజకీయాల కోసం ఈ రంగానికి బ్రేక్ ఇచ్చారు. ఇక, చాలా గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని మెగాస్టార్.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ ప్రాజెక్టులనూ లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాన్ ఇండియా డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా చేయబోతున్నారని ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  కరోనా బాధితులకు మెగా ప్రాణవాయువు.. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు (ఫోటోలు)

  మెగా మల్టీస్టారర్‌లో నటిస్తోన్న చిరంజీవి

  మెగా మల్టీస్టారర్‌లో నటిస్తోన్న చిరంజీవి

  రీఎంట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య'లో నటిస్తున్నారు. ఇందులో చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చిరంజీవి, చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు.

  పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సినిమాకు రెడీ

  పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సినిమాకు రెడీ

  ‘ఆచార్య' షూటింగ్ జరుగుతుండగానే మలయాళ మూవీ ‘లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. మోహన్‌లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ స్క్రిప్టును మన నేటివిటీకి తగ్గట్లుగానే మార్పులు చేయించారు. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది.

  డిజాస్టర్ చిత్రాల దర్శకుడికి చిరు ఛాన్స్

  డిజాస్టర్ చిత్రాల దర్శకుడికి చిరు ఛాన్స్

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలను తెరకెక్కించినా.. ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా దక్కించుకోలేకపోయాడు మెహర్ రమేష్. అలాంటి దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చారు. అతడితో తమిళంలో బంపర్ హిట్ అయిన ‘వేదాళం'ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ గుండు లుక్‌తో కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.

  టాలెంటెడ్ దర్శకుడితో చిరంజీవి ప్రాజెక్టు

  టాలెంటెడ్ దర్శకుడితో చిరంజీవి ప్రాజెక్టు

  ఇప్పటికే మూడు సినిమాలను చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. మరో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టేశారు. దీన్ని టాలెంటెడ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ రూపొందించబోతున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా వెల్లడించారు. ఇక, ఈ మధ్య జరిగిన ‘ఉప్పెన' ఈవెంట్‌లోనూ ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది.

  లూసీఫర్.. వేదాళం తర్వాత మరో రీమేక్‌

  లూసీఫర్.. వేదాళం తర్వాత మరో రీమేక్‌

  రీమేక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. దీని తర్వాత ‘లూసీఫర్', ‘వేదాళం' చిత్రాలను కూడా తెలుగులోకి మార్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవి పట్టాలు ఎక్కకుండానే మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టేసుకున్నారాయన. అదే... గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘ఎన్నై అరిదాల్'. దీన్నే మెగాస్టార్ రీమేక్ చేయనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

  పాన్ ఇండియా దర్శకుడితో చిరు మూవీ

  పాన్ ఇండియా దర్శకుడితో చిరు మూవీ

  ‘ఎన్నై అరిదాల్' ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మించారు. దీనికి సంబంధించిన రీమేక్ హక్కులను రామ్ చరణ్ ఇప్పటికే తీసుకున్నాడు. నిజానికి ఈ సినిమా ‘ఎంతవాడు గానీ' అనే పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. అయినా దీన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు చిరు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరొందిన సుజిత్ రూపొందిస్తాడట.

  Chiranjeevi, Ram Charan Started Oxygen Banks In Telugu States
  అప్పుడలా మిస్సైంది... ఈ సారి పక్కాగా

  అప్పుడలా మిస్సైంది... ఈ సారి పక్కాగా

  వాస్తవానికి సుజిత్‌తో మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్' సినిమాను రీమేక్ చేయాలని భావించారు. అయితే, స్క్రిప్టు వర్క్ విషయంలో తేడాలు వచ్చి అతడు దీని నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు మిస్సైన ఈ కాంబో ఇప్పుడు ఫిక్స్ చేశారని తెలిసింది. ఇప్పటికే సుజిత్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు. గతంలో ఈ డైరెక్టర్ ‘సాహో' తీసిన విషయం తెలిసిందే.

  English summary
  Megastar Chiranjeevi Now Doing Acharya with Koratala Shiva. After That He will do Mohan Raja, Mehar Ramesh and Bobby Direction. Now News is That Chiranjeevi to do Yennai Arindhaal Remake with Sujeeth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X