»   » చరణ్ ధోరణి చిరుకి ఇబ్బందులు తెచ్చేట్టే ఉంది... మరీ అంత అత్యాశా..?

చరణ్ ధోరణి చిరుకి ఇబ్బందులు తెచ్చేట్టే ఉంది... మరీ అంత అత్యాశా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరు మూవీ కత్తిలాంటోడు పై భారీ అంచనాలే ఉన్నాయి కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్న రామ్ చరణ్ అంచనా మరీ ఎక్కువగా ఉన్నాయట. ఆయన సినిమాని అమ్మాలనుకుంటున్న రేట్లు బాహుబలి స్థాయిలో ఉన్నాయట. మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా "కత్తి లాంటోడు" షూటింగ్ స్పీడ్ గా జరుగుతూ ఉండటంతో అప్పుడే బయ్యర్ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరిందని టాక్.

కత్తిలాంటోడు ఓవర్ సీస్ హక్కులకు సంబంధించి వస్తున్న ఎంక్వైరీలకు ఈసినిమా నిర్మాత చరణ్ చెపుతున్న రేట్స్ విని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వినాయక్ కూడా ఆశ్చర్య పోయాడట, ఎందుకంటే ఈసినిమా ఓవర్సీస్ రేట్లు దాదాపుగా "బాహుబలి" ఓవర్సీస్ రేట్లకి దగ్గరగా ఉన్నాయట. ఈ భారీ నంబర్లను విన్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ బెంబేలు పడుతున్నారు.

chiru's kattilantodu overseas rates shocks every one

తొమ్మిదేళ్ల తర్వాత వస్తున్న సినిమా అయినా మరీ అంత బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసి భారీ ధరలని నిర్ణయిస్తే మొదటికే మోసం వస్తుందంటూ దర్శకుడు వీ.వీ. వినయాక్ కూడా మథన పడుతున్నాడనీ కానీ దైరెక్త్ గా చెర్రీకి చెప్పలేకపోతున్నాదనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అంతే కాదు ఓకరిద్దరు ఓవర్సీస్ రేట్ల మీద చరణ్ కి చెప్పే ప్రయత్నం చేసారట. దాంతో చరణ్ ఒక బినామీ వ్యక్తి పేరున తానే "కత్తి లాంటోడు" ఓవర్సీస్ రేట్స్ ను తన వద్ద ఉంచుకుని అత్యంత భారీ మొత్తాలకు అమ్మినట్లుగా ప్రచారం చేసి ఈ సినిమా మార్కెట్ కు విపరీతమైన క్రేజ్ తీసుకు రావాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు గాసిప్పులు వినపడుతున్నాయి. అయితే ఈవార్త ఎంతమేరకు ఖచ్చితంగా నిజమన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

chiranjeevi

ఈ ఓవర్ రేట్ల విసయం కాస్తా లోకల్ బయ్యర్లకి చేరతం తో చరణ్ ఇదే పద్ధతిని మన ఇరు రాష్ట్రాలలో కూడ కొనసాగించి బయ్యర్లకు భారీ మొత్తాలు కోట్ చేస్తూ చుక్కలు చూపెడతాడా ? అన్న అనుమానం అప్పుడే చాల మంది బయ్యర్లకు ఏర్పడింది అని అంటున్నారు. 9 సంవత్సరాల తరువాత విడుదల కాబోతున్న చిరంజీవి "కత్తిలాంటోడు" పై ఎంత భారీ క్రేజ్ ఉన్నా మరీ "బాహుబలి" రేంజ్ లో ఊహించుకోవడం అత్యాశ అవుతుందని చరణ్ కి ఎవరైనా చెప్తారో లేదో...

English summary
Director Vinayak Getting Shocked With Chiranjeevi Over Greed for his new Movie Kattilantodu in Overseas
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu