»   »  కలర్స్ స్వాతి పెళ్ళా?

కలర్స్ స్వాతి పెళ్ళా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Colors Swathi
కృష్ణవంశి 'డేంజర్' సినిమాతో పరిచయమై 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రంతో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి కలర్స్ స్వాతి. ఆమె త్వరలో వివాహం చేసుకోనున్నట్లు గత రెండు రోజులుగా తమిళ,తెలుగు పరిశ్రమలలో హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఇది రూమరో...నిజమైన వార్తో ఎవరూ తేల్చుకోలేక పోతున్నారు. ఈ నెల 27న,తిరుపతిలో దుబాయి బేస్డ్ పారిశ్రమికవేత్తను పెళ్ళాడనున్నట్లు అంటున్నారు. ఈ పంక్షన్ కి సినీ పెద్దలు అందరూ అటెండు అవటానికి ప్రిపేర్ అవుతున్నారని చెప్పుకుంటున్నారు . మరికొంత మంది ఇది ఒక పుకారని ఆమె కెరీర్ పై బురద జల్లటానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే స్వాతి మాత్ర ఎక్కడా దీనిపై స్పందించినట్లు లేదు.అందులోనూ స్వాతి తమిళంలోనూ సుబ్రమణ్యపురం సినిమాతో హిట్ కొట్టడం,ఇక్కడ అష్టాచెమ్మా సినిమా రిలీజ్ అయ్యే సమయం కావటంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X