»   » 'అప్పలరాజు' సునీల్ సరసన హీరోయిన్ ఎవరంటే...

'అప్పలరాజు' సునీల్ సరసన హీరోయిన్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్ హీరోగా కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 27న అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ కానుంది. ఇక ఈ చిత్రలో సునీల్ సరసన కలర్స్ స్వాతిని ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూహూర్తం పంక్షన్ కి అతిలోక సుందరి శ్రీదేవి గెస్ట్ గా హాజరుకానుందని చెప్తున్నారు. కోనేరు కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కామిడీగా ఉంటుందని, అందరు కమిడయన్స్ నటిస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో స్ట్రైయిట్ ఫిల్మ్ గా డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటంతో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మర్యాదరామన్న విజయం తర్వాత సునీల్ చేస్తున్న ఈ చిత్రం జనవరి 12.2011న రిలీజ్ కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu