»   » సప్తగిరి హీరోగా చిత్రం...పవన్ కళ్యాణ్ లింక్

సప్తగిరి హీరోగా చిత్రం...పవన్ కళ్యాణ్ లింక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ చిత్రంలో పాట చరణాలను,పదాలను టైటిల్ పెడ్తూ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సప్తగిరి హీరోగా రూపొందుతున్న చిత్రానికి అత్తారింటికి దారేది చిత్రంలోని తొలి సాంగ్ అయిన 'ఆరుడగుల బుల్లెట్' ని టైటిల్ గా పెడుతున్నట్లు తెలుసింది. మారుతికి చెందిన గుడ్ సినిమా గ్రూప్ వారు ఈ సినిమాని రూపొందించనున్నారని టాక్. అయితేఈ టైటిల్ ...నిర్మాత బీవీయస్ యన్ ప్రదాస్ గారి దగ్గర ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రేమ కథా చిత్రం, వెంకటాద్రి ఎక్సప్రెస్, లవర్స్ చిత్రాలతో తనలోని కామెడీ టింజ్ ఏమిటో చూపించి, సినిమా హిట్ కు కారణమైన సప్తగిరి హీరోగా సినిమా అంటే ఖచ్చితంగా ఓపినింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దర్శకుడు ఎవరనేది తెలియలేదు. అలాగే హీరోయిన్ ఎంపిక జరుగుతోందని వినపడుతోంది.

Comedian Saptagiri to turn Hero as Aradugula Bullet

ఇక బ్రహ్మానందం తర్వాత ఆయనలా కామెడీలో ఆ స్ధాయికి చేరుకున్నవారు లేరు. సునీల్ ఆ స్లాట్ ని ఫిల్ చేస్తాడనుకున్నారు. అయితే హీరోగా టర్న్ తీసుకున్నాడు. బ్రహ్మానందం నుంచి, అలీ, వేణు మాధవ్, దన్ రాజ్, వెన్నెల కిషోర్ ల వరకూ అందరూ హీరోగా ట్రై చేసి ఆ ప్లేస్ ని భర్తీ చేయలేకపోయారు. మరి ఇప్పుడు సప్తగిరి టర్న్ వచ్చింది. హీరోగా ట్రై చేస్తున్నాడు. మరి కెరీర్ లో హీరోగా ఎదుగుతాడో లేదో చూడాలి.

హ్యాపీడేస్' సినిమాలో నెల్లూరు కుర్రోడిలా.. అమాయకంగా కనిపించిన సప్తగిరి.. బన్నీ 'పరుగు' మూవీతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోపడ్డాడు. ఇక ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రం'లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన అమాయకత్వపు కామెడీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆట్టుకుంది. ఇక అంతే వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి సప్తగిరికి.

అలా సందీప్ కిషన్ మూవీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో బాగా పాపులర్ అయ్యాడు. తన మార్కు డిఫరెంట్ కామెడీని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా హిట్ లో ముఖ్య పాత్ర సప్తగిరిది ఉందంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన కామెడీని పంచుతూ.. నవ్వులు పంచుతున్న సప్తగిరి త్వరలోనే స్టార్ కమెడియన్ అవుతాడనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడీ కొత్త హీరోగా మారే టర్న్ అతన్ని ఎక్కడ పెడుతుంతో మరి.

English summary
Saptagiri has signed a new film which will see him playing the lead. Tentatively titled as "Aradugula Bullet" after the popular song in Pawan Kalyan's Attarintiki Daredi, the film is currently under pre-production phase.Saptagiri has carved a niche for himself. Of late, he has become one among the star comedian and even called as "Jr Brahmanandam". Saptagiri's roles in Prema Katha Chitram, Venkatadri Express, Lovers etc were received well. If Saptagiri steps into hero role, he'd join the bandwagon of previous comedians-turned-heroes Ali, Sunil to name a few.
Please Wait while comments are loading...