For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? టాలీవుడ్ టాప్ హీరోలు కుళ్లుకునేంతగా..

  By Rajababu
  |

  సిల్వర్ స్క్రీన్‌పై తడాఖా చూపించిన అగ్రహీరోలు నాగార్జున, చిరంజీవి బుల్లితెర మీద తమ హవాను సక్సెస్‌పుల్ కొనసాగించారు. ప్రస్తుతం వారిద్దరి తర్వాత ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్‌తో టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఇప్పటికే క్రేజీ రియాలిటీ షోగా మారిన బిగ్‌బాస్ షోను తెలుగులో ఎన్టీఆర్ చేస్తున్నారనే సరికి భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షోను చేయడానికి ఎన్టీఆర్ ఎంత తీసుకొన్నారు? స్టార్ మా టెలివిజన్ ఎన్టీఆర్‌ను ఈ షో కోసం ఒప్పించడానికి ఏ మేరకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారనే ప్రశ్నలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం దక్షిణాదిలో ఏ హీరో తీసుకోనంత మొత్తాన్ని ఈ షో కోసం తీసుకొన్నాడనేది సినీవర్గాల్లో చర్చ జరుగున్నది.

  దూసుకెళ్తున్నఎన్టీఆర్

  దూసుకెళ్తున్నఎన్టీఆర్

  టాలీవుడ్‌లో ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్‌ను ఒక్కసారి చూస్తే.. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం జై లవకుశ చిత్రంలో నటిస్తున్నాడు యంగ్ టైగర్. ఈ చిత్రాన్ని స్వయంగా ఆయన సోదరుడు, నటుడు కల్యాణ్ రామ్ నిర్మించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో మోత మోగిస్తున్నది.

  Bigg Boss Jr. NTR's Twitter Handle More Than 1 Million Followers Now
  రెమ్యునరేషన్‌పై యంగ్ టైగర్ క్లారిటీ

  రెమ్యునరేషన్‌పై యంగ్ టైగర్ క్లారిటీ

  ఇలాంటి స్టార్ స్టాటస్ ఉన్న యంగ్ టైగర్ బుల్లితెర మీద కనిపించడానికి తక్కువ మొత్తంలో తీసుకోడనేది టాక్. అయితే బిగ్‌బాస్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాత్రం తన రెమ్యూనరేషన్‌పై కొంత క్లారిటీ ఇచ్చాడు. తన భార్య, బిడ్డలకు సరిపోయేంత అని చెప్పుకొచ్చారు. అంటే ఆయన భార్య బిడ్డలు తక్కుమ మొత్తానికి సంతృప్తి పడరని అర్థమైపోయింది.

  దిమ్మ తిరిగే పారితోషికం

  దిమ్మ తిరిగే పారితోషికం

  ఇంకా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ మీరు అనుకునేంత మాత్రం కాదు అని చెప్పారు. మీరు ఇలా అడుతుంటే నాకు ఎంత ఇచ్చారో అనే విషయాన్ని ఇంటికి వెళ్లి ఆలోచించాలి అని అన్నారు. ఇలా తన రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ చాలా తెలివిగా దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ తెలుగు హీరోలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ఇచ్చారనేది ఇన్‌సైడ్ టాక్.

  అగ్రహీరోలకు కళ్లు తిరిగే మొత్తం

  అగ్రహీరోలకు కళ్లు తిరిగే మొత్తం

  బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకొన్న పారితోషికం అనధికారికంగా సుమారు రు.25 కోట్లు మొత్తం ఉండవచ్చనేది తాజా సమాచారం. ఈ మొత్తం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ, తక్కువ ఉండటానికి అవకాశం లేదని పలువురు బల్లగుద్ది చెప్తున్నారు. ఎన్టీఆర్ తీసుకొన్న రెమ్యునరేషన్ మాత్రం ఇండస్ట్రీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్నదనే విషయం ఫిలింనగర్ విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

  బిగ్ బాస్‌ కోసం షూటింగ్ షిప్ట్

  బిగ్ బాస్‌ కోసం షూటింగ్ షిప్ట్

  ప్రస్తుతం జై లవకుశ షూటింగ్ నిరవధికంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతున్నది. అయితే బిగ్‌బాస్ కోసం ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్‌ను మహారాష్ట్రలోని పుణెలో చేయాలని నిర్ణయించారు. ముంబైకి సమీపంలోని లోనావాలాలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ సెట్ పుణేకు దగ్గరగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తున్నది. బిగ్‌బాస్ కోసం వారంలో రెండు రోజులు అంటే శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ వెళ్తారు. ఈ క్రమంలో వీలుగా ఉండేందుకు తన షూటింగ్‌ను లోనావాలాకు దగ్గరగా ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తున్నది.

  జూలై 15న బుల్లితెరపై మెరువనున్న ఎన్టీఆర్

  జూలై 15న బుల్లితెరపై మెరువనున్న ఎన్టీఆర్

  ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో జూలై 15వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. దాదాపు 70 రోజులు పెద్ద భవనంలో కలిసి ఉంటారు. ఈ భవనం చుట్టూ 70 కెమెరాలు అమర్చారు. ఇప్పటికే తమిళ వెర్షన్ ప్రారంభమైన బిగ్‌బాస్‌కు మంచి స్పందన వస్తున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

  English summary
  Junior NTR is now sensational in Telugu television industry. As host of Bigboss show, He getting ready with for July 15th very first episode. There is buzz that NTR has taken huge amount for Bigboss show as remuneration.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X