»   » పవన్ కళ్యాణ్ ప్లేస్ లోకి వెంకటేష్ ...?

పవన్ కళ్యాణ్ ప్లేస్ లోకి వెంకటేష్ ...?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం దబాంగ్ కి రీమేక్. ఈ నేపధ్యంలో అంతా దబాంగ్ 2 విడుదల అవుతోందంటే...పవన్ చేస్తాడనుకున్నారు. దానికి తోడు గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్ అనే టైటిల్ ని సైతం రిజిస్టర్ చేయించారు. దాంతో గబ్బర్ సింగ్ సీక్వెల్ వస్తుందని అభిమానులు ముచ్చటపడ్డారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి దబాంగ్ 2 ని వెంకటేష్ చేసే అవకాసముందని తెలుస్తోంది. ఈ మేరకు సల్మాన్ తో చర్చలు జరగాయని చెప్తున్నారు. అయితే ఇది రూమరా లేక వాస్తవమా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  ఆ మధ్యన రానా సోదరి మాళవిక వివాహానికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. అప్పుడు రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్ చాలా సేపు డిస్కస్ చేసారు. అప్పుడు దబాంగ్ 2 విషయం ప్రస్దావనకి వచ్చిందని, దాన్ని వెంకటేష్ కి ఇవ్వటానికి సల్మాన్ ఆసక్తి చూపాడని వార్త ప్రచారంలోకి వచ్చింది. మరో ప్రక్క తాము దబాంగ్ 2 రైట్స్ తీసుకోవటం లేదని నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ గతంలో తెలియచేసారు.

  ఇక దబాంగ్ 2 విషయానికి వస్తే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ వంటి ఊపులో ఉన్న హీరో...అదీ దబాంగ్ చేసిన హీరో చేసిన సీక్వెల్ కాబట్టి ఆ రేంజిలో కలెక్షన్స్ ఉన్నాయి కానీ...వెంకటేష్ చేస్తే ఓపినింగ్స్ ఆ రేంజిలో ఉంటాయా అన్నది ఇండస్ట్రీలో చర్చగా సాగుతోంది. ఇంతకుముందు కూడా వెంకటేష్ ఇలాగే...చంద్రముఖి సీక్వెల్ అంటూ నాగవల్లి ని రీమేక్ చేసారు. అదీ డిజాస్టర్ అయ్యింది. అలాగే బాడీగార్డ్ చిత్రం అత్యుత్సాహంతో చేస్తే అదీ వర్కవుట్ కాలేదు. కాబట్టి వెంకటేష్ ఆచితూచి అడుగు వేయటం మంచింది.

  English summary
  Presence of Salman Khan in Hyderabad recently to attend a lunch with Daggubati family is spreading new rumors in market. The top B-town actor was in city to bless Malavika, the newly married daughter of Suresh Babu. Along with Suresh Babu, there was Rana, Venkatesh and Rama Naidu known to have spent nearly two to three hours discussing many things. One among them was the possible remake of ‘dabangg 2′ for Venkatesh. Ever since producer Bandla Ganesh Babu, Pawan Kalyan and director Harish Shankar have publicly accepted that there are no plans on the anvil to remake ‘dabangg 2,’ none were able to anticipate that Venky is in the line.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more