»   » రామ్ చరణ్ రిస్క్ తీసుకుంటున్నాడా..? ధృవ కి కనీస జాగ్రత్తలు లేవు.. ఈ సారీ ఫ్లాప్ కి ఎదురీతేనా

రామ్ చరణ్ రిస్క్ తీసుకుంటున్నాడా..? ధృవ కి కనీస జాగ్రత్తలు లేవు.. ఈ సారీ ఫ్లాప్ కి ఎదురీతేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ల మయం... ప్రతీ చిన్న విషయం లోనూ శకునాలను చూసుకోవటం.., ఫెయిల్యూర్లకు కూడా ఆయా నటీ నటుల "ఫేట్" కారణం అవుతుందని నమ్మటం, వరసగా రెండు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అనటం ఇలా ఇంకా చాలానే నమ్మకాలు సినీ ఇండస్ట్రీ లో ఉంటాయి....

కోట్ల వ్యవహారం కాబట్టి ఏ చిన్న రిస్కూ తీసుకోలేరు ఏమో..! ఆ నమ్మకమే నిజమవ్వచ్చేమో అన్న విషయాన్ని కూడా తేలికగా వదిలెయ్యలేరు... కానీ వరసగా మూడోసారి సెంటిమెంట్ ని కాదని రిస్క్ చేస్తున్నాడు రామ్ చరణ్. అంతే కాదు ఒక సినిమాని అనువాదం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా ధృవ టీం తీసుకోలేదు. అంతేకాదు... కాదు చరణ్ అన్నీ తనకు వ్యతిరేకంగా ఉండే పనులే చేస్తున్నాడు... సెంటిమెంట్లలాంటి నమ్మకాలు తనకు లేవని చెప్పాలనుకుంటున్నాడా..? ధృవ హిట్ తోనే ఆవిషయం చెప్పాలనుకుంటున్నాడేమో గానీ చెర్రీ రిస్క్ తీసుకుంటున్నాడేమో అనే వాళ్ళూ లేకపోలేదు. అసలింతకీ ఏమిటా సెంటిమెంట్... తనీ ఒరువన్ వల్ల ధృవకి వచ్చే నష్టమేమిటీ అంటే....

రెండు సార్లు

రెండు సార్లు

ఇప్పటి వరకు రెండు సార్లు దసరా బరిలో దిగిన చెర్రీ ఒక్క సారి కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అటుంచి మెగా స్టామినాకి తగ్గ కనీసం అబౌయావరేజ్ కూడా సాధించలేదు.

జస్ట్ సోసో

జస్ట్ సోసో

2014 లోదసరా కానుకగా వచ్చిన గోవిందుడు అందరివాడేలేతో జస్ట్ సోసో అనిపించుకుంది. చెర్రీ, 2015లో బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచాడు. ఆఖరికి మెగాస్టార్ క్యామియో కూడా బ్రూస్ లీ ని గట్టెక్కించలేకపోయింది.

మళ్ళీ దసరా కే

మళ్ళీ దసరా కే

అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వచ్చీరాని దసరా కే మళ్ళీ రాబోయే సినిమా ధృవ ని కూడా రిలీజ్ చేయటానికి సిద్దపడ్డాడు. పాత చేదు అనుభవాలని చూసి కూడా చెర్రీ భయపడకపోయినా... ఈ సారి కూడా ఈ సెంటిమెంట్ ప్రభావం సినిమా ఫలితాల మీద ఉంటుందేమో అని అభిమానులే కలవర పడుతున్నారు.

తమిళ సినిమా రీమేక్

తమిళ సినిమా రీమేక్

ఇక ఈ సెంటిమెంట్ ని పక్కన పెడితే ఇది తమిళ సినిమా ‘తనీ ఒరువన్' కు రీమేక్ అని వేరే చెప్పనక్కర్లేదు. అక్కడ సూపర్ హిట్ కావడంతో చరణ్ రీమేక్ చేస్తున్నాడు. మరి ఇలాంటి వివరాలు తెలిసినప్పుడు.. అసలు వెర్షన్ ఎలా ఉందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో సహజంగానే కలుగుతుంది.

ధ్రువ పైఆసక్తి తగ్గుతుంది

ధ్రువ పైఆసక్తి తగ్గుతుంది

"తనీ ఒరువన్" ఎలా ఉందో చూద్దామని తెలుగు ప్రేక్షకులు భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి "తనీ ఒరువన్" సినిమాను చూసే అవకాశం ఉందంటే.. "ధ్రువ" పై కచ్చితంగా ఆసక్తి తగ్గుతుంది!

జాగ్రత్తలు లేవు

జాగ్రత్తలు లేవు

ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన థియరీ ఏమీ కాదు. ఏ సినిమా రీమేక్ రైట్స్ ను కొన్న వాళ్లు అయినా.. సదరు సినిమా ప్రింట్ అఫిషియల్ గా ఇంటర్నెట్ లో లేకుండా చూసుకుంటారు. కానీ "ధ్రువ" విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదు.

ఆడియన్స్ కు అందకుండా చూసుకోవడం

ఆడియన్స్ కు అందకుండా చూసుకోవడం

ఒరిజినల్ మూవీ ని రీమేక్ టార్గెటెడ్ ఆడియన్స్ కు అందకుండా చూసుకోవడం కూడా ప్రధానమే. రీమేక్ సినిమాలు చేసే వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా తాము రీమేక్ చేస్తున్న సినిమా ఒరిజినల్ వెర్షన్ వీడియోలు అధికారికంగా అందుబాటులో లేకుండా చూసుకోవడం వీరి పనే

భారీ అంచనాలే ఉన్నాయి

భారీ అంచనాలే ఉన్నాయి

ధ్రువ పై భారీ అంచనాలే ఉన్నాయి అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు

ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు

అయితే ధృవ సినిమా రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన చెర్రీ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

English summary
Ram Charan ready to face the risk..? Dasara turns Bad sentiment for Ram Charan.., Dhruva releasing for Dasara again
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu