రష్మిక ప్లేస్ కొట్టేసిన జాన్వీ కపూర్..! అతనితో కలిసి.. వైరల్ అవుతున్న న్యూస్
తెలుగుతో పాటు ఇతర మూడు సౌత్ ఇండియన్ భాషల్లో ఈ రోజే (శుక్రవారం) విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాలో రన్ టైమ్ ఎక్కువైందని, కథ కాస్త స్లోగా నడించిందనే టాక్ వస్తోంది. కాకపోతే క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ మాత్రం మరో కిక్కిచ్చిందని అంటున్నారు ప్రేక్షకులు.
మరోవైపు 'డియర్ కామ్రేడ్' సినిమా హిందీ రీమేక్ పనులు చకచకా జరుగుతున్నాయట. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తానని బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇందుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేశారని తెలుస్తోంది. అయితే తెలుగు డియర్ కామ్రేడ్ లాగే హిందీలో క్రేజీ జోడీని ఎన్నుకొని హీరోహీరోయిన్లుగా నటింపజేయాలని ప్లాన్ చేశారట కరణ్. ఈ నేపథ్యంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో పెట్టారని సమాచారం.

గతంలో ఇషాన్ ఖత్తర్- జాన్వీ కపూర్ జోడీ 'ధఢక్' సినిమాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అదే కాంబినేషన్‌తో హిందీ 'డియర్ కామ్రేడ్' రూపొందించాలని ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' సూపర్ సక్సెస్ కావడంతో 'డియర్ కామ్రేడ్' రీమేక్‌పై బీ టౌన్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివారాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











