»   » ప్రియుడికి దూరంగా ఉండలేకే దీపిక అంత పని చేసిందా?

ప్రియుడికి దూరంగా ఉండలేకే దీపిక అంత పని చేసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్రిపుల్ ఎక్స్: జాండ‌ర్ కేజ్‌ సినిమా ద్వారా హాలీవుడ్లో అడుగు పెట్టిన దీపిక పదుకోన్.... ఈ సినిమా కోసం చాలా బాలీవుడ్ సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అంతే కాదు తన ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌కు కూడా నెలల తరబడి దూరంగా ఉండాల్సి వచ్చింది.

హాలీవుడ్ అవకాశం ఏమో కానీ... తన జీవితంలో చాలా కోల్పోయినట్లు ఫీలయిందట దీపిక. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా ఆమెకు మరో హాలీవుడ్ అవకాశం రాగా.... దీపిక సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ అవకాశాన్నే వదులుకుందట.

పద్మావతి కోసమా? ప్రియుడి కోసమా?

పద్మావతి కోసమా? ప్రియుడి కోసమా?

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `ప‌ద్మావ‌తి` చిత్రంలో బిజీగా ఉండ‌టం వల్లనే హాలీవుడ్ అవకాశాన్ని వదులుకుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.... అసలు విషయం అది కాదని, ప్రియుడికి దూరంగా ఉండాల్సి వస్తుందని, లైఫ్‌ను ఎంజాయ్ చేసే సమయాన్ని కోల్పోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీపిక-రణవీర్

దీపిక-రణవీర్

`రామ్‌లీలా`, `బాజీరావు మ‌స్తానీ` చిత్రాల త‌ర్వాత దీపికా, ర‌ణ్‌వీర్‌లు `ప‌ద్మావ‌తి` చిత్రంలో జంట‌గా న‌టిస్తున్నారు. ఇందులో షాహిద్ క‌పూర్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ర‌ణ్‌వీర్ `అల్లాఉద్దీన్ ఖిల్జీ`గా, షాహిద్ ప‌ద్మావ‌తి భ‌ర్త `ర‌త‌న్ సింగ్‌`గా న‌టిస్తున్నారు.

లీక్ ఫోటోలతో దర్శకుడి ఇబ్బంది

లీక్ ఫోటోలతో దర్శకుడి ఇబ్బంది

దీపిక, రణ్‌వీర్ సింగ్ రొమాన్స్‌లో మునిగితేలుతున్న ఫోటోలు ఇటీవల లీక్ అయ్యాయి. అయితే పద్మావతి సినిమాలో మాత్రం వీరి పాత్రలు భిన్నంగా ఉంటాయట. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫోటోల వల్ల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇబ్బంది పడుతున్నారట.

దీపిక, రణ్‌వీర్ చెట్టాపట్టాల్

దీపిక, రణ్‌వీర్ చెట్టాపట్టాల్

ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత రితేశ్ సిద్వానీ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ముంబైలో జరిగాయి. ఈ వేడుకలో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ ఒకే కారులో రావడం విశేషం.

బ్రేకప్ అబద్దమే

బ్రేకప్ అబద్దమే

హాలీవుడ్ సినిమాలో బిజీగా ఉండటం వల్ల ఆ మధ్య దీపిక పదుకోన్, రణ్ వీర్ సింగ్ కలవడం తగ్గించారు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి. తాజాగా 'పద్మావతి' సినిమాలో నటిస్తున్న వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారంటూ ఈ వేడుకకు జంటగా వచ్చిన వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

English summary
Deepika Padukone has been avoiding signing any films or confirming her availability to filmmakers who are approaching her. The reason is that she is immersed completely in Sanjay Leela Bhansali’s Padmavati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu