దేవిశ్రీప్రసాద్ హీరో చేస్తున్న చిత్రం టైటిల్ ఇదే ?
హైదరాబాద్ : సుకుమార్ ప్రొత్సహించడంతో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దేవిశ్రీప్రసాద్. దాంతో దిల్ రాజు నిర్మాతగా సుకుమార్ డైరెక్షన్లో దేవిశ్రీ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయనున్నారు, కథ ఏంటి..టైటిల్ ఏం పెట్టబోతున్నారనే విషయంపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ రాక్ స్టార్ అంటూ ప్రచారం వెబ్ మీడియాలో మొదలైంది.
ఇక సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేయాలని చాలా రోజులుగా దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. కుమారి 21 ఎఫ్ చిత్ర సక్సెమీట్‌లో దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నానని ప్రకటించాడు దిల్‌రాజు.

దిల్ రాజు మాట్లాడుతూ....ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నేను నటించదగ్గ కథ కుదిరితే హీరోగా నటిస్తానని దేవి చెప్పాడు. అందుకే అతన్ని మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం చేయబోతున్నాను. 12 ఏళ్ల క్రితం ఆర్యతో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్‌ని అందించిన అదే టీమ్‌తో ఈ సినిమా చేయబోతున్నాను. సుకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తారు అని తెలిపారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ నిర్మాతల్లో శిఖరం లాంటి వ్యక్తి దిల్ రాజు, దర్శకుల్లో శిఖరం సుకుమార్, కెమెరామెన్ లలో శిఖరం రత్నవేలు. ఈ ముగ్గురు నన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తామని చెప్పడం ఆనందంగా వుంది అన్నారు.


Click it and Unblock the Notifications











