»   » 'సర్దార్' లో కాపు కులం ప్రస్దావన..డైలాగు?

'సర్దార్' లో కాపు కులం ప్రస్దావన..డైలాగు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న బర్నింగ్ ఇష్యూ కాపు గర్జన. రత్నాచల్ ఎక్సప్రెస్ ని తగలపెట్టడంతో ఈ విషయం మరింత హీట్ ఎక్కింది. అదే సమయంలో జన సేన అధినేతగా పవన్ కళ్యాణ్ ...మీడియాతో మాట్లాడారు. అదీ చర్చనీయాంశమైంది.

పవన్ కళ్యాణ్ కాపు కావటంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపధ్యంలో త్వరలో తను స్క్రీన్ ప్లే రాసి, నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ కాపులకు సంభందించిన డైలాగులు ఉంటాయనే వార్తలు అంతటా వినపడుతున్నాయి.


గతంలో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో మీడియాపై సెటైర్స్ పేల్చిన, పవన్ ఈ సారి సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ కాపులకు సంభందించిన డైలాగ్స్ పెడుతున్నారని వార్త.


Dialogue about Kapus in Sardaar?

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి...సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ ... ఓ పెద్ద డైలాగుని తనదైన ట్రైడ్ మార్క్ స్టైల్ తో కాపులను ఉద్దేశించి చెప్తాడని అంటున్నారు. మరి ఈ డైలాగు ప్రభుత్వానికి సపోర్ట్ చేసేదిగా ఉంటుందా లేక కాపుల రిజర్వేషన్స్ ఇవ్వాలంటూ పూర్తిగా సపోర్ట్ చేసే విధంగా సాగుతుందో చూడాలి.


అయితే పవన్ తెలివిగా కాస్ట్ సిస్టం, రిజర్వేషన్స్ గురించి ఈ డైలాగు రాయించాడని, దాంతో ఫలానా కాస్ట్ అనికాకుండా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకునేలా కరెంట్ టాపిక్ గుర్తు చేసేలా ఆ డైలాగుని డిజైన్ చేసాడని చెప్తున్నారు. ఇంతకీ ఈ డైలాగు నిజంగా రాయించాడా..సెన్సార్ దాటుతుందా వంటి విషయాలు తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.

English summary
Pawan is coming up with a lengthy dialogue about Kapus in his forthcoming flick Sardaar Gabbar Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu