»   » షాక్: ‘డిక్టేటర్‌’ఫుల్ మూవీ ... టీవీ ఛానెల్ యూట్యూబ్ లో

షాక్: ‘డిక్టేటర్‌’ఫుల్ మూవీ ... టీవీ ఛానెల్ యూట్యూబ్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్ . శ్రీవాస్‌ దర్శకుడు. వేదాశ్వ క్రియేషన్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మించాయి. తమన్‌ స్వరాలందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు పైరసీ బారిన పడింది.

అయితే చిత్రం ఏమిటంటే తెలుగులో ప్రముఖ ఛానెల్ అయిన జెమినీ వారి ఎక్కౌంట్ ద్వారా ఈ సినిమా యూట్యూబ్ లో అప్ లోడ్ కావటం. దాంతో అందరూ షాక్ అయ్యారు. అది ఎలా జరిగిందనేది ఎవరికీ అర్దం కాలేదు.


Dictator Full Movie in Gemini TV Youtube Channel Leaked

అయితే ఎవరైనా జెమినీ టీవీ యూట్యూబ్ ఛానెల్ ని హ్యాక్ చేసి అప్ లోడ్ చేసారా అని అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే అప్ లోడ్ జరిగిందని తెలిసిన కాస్సేపటికి దాన్ని వారు తొలిగించారు. కానీ ఈ విషయమై నందమూరి అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ లింక్ ని ఇస్తూ హాట్ టాపిక్ గా మారింది.


Dictator Full Movie in Gemini TV Youtube Channel Leaked

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Balakrishna’s Latest Super Hit Film Dictator Full Movie Uploaded in Youtube. i.e also in the Official Channel. GeminiTV even started uploading Piracy stuff on its official YouTube page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu