»   » దేముడా... వి.వి వినాయిక్ పై ఇదేం చెత్త రూమర్ ?

దేముడా... వి.వి వినాయిక్ పై ఇదేం చెత్త రూమర్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివి వినాయిక్ దర్శకత్వంలో అఖిల్ ని హీరోగా లాంచ్ చేస్తూ వచ్చిన చిత్రం అఖిల్. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ విషయాన్ని బేస్ చేసుకుని ఇప్పుడో రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ మీడియాలోనూ ప్రచారం అవుతోంది.

ఆ రూమర్ ఏమిటంటే...ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి ముందు వినాయక్ ఓ సొంత ఇంటిని కొని తన అభిరుచికి తగ్గట్టుగా కోట్లు ఖర్చు చేసి కట్టుకున్నారు. కానీ అఖిల్ సినిమా ప్లాప్ తో దర్శకుడు కూడా ఆ బాధ్యతను తీసుకున్నారు. ఆ క్రమంలో సినిమా కొన్న బయ్యర్స్ కు వచ్చిన నష్టం పంచుకోవడంతో పాటు అఖిల్ నిర్మాత అయిన నితిన్ కు తన రెమ్యునేషన్ లో 5 కోట్లకు పైగా వదులుకున్నట్లు వినపడుతోంది.


Did Director V.VVinayak Sold his House?

దీంతో ఎంతో ఇష్టంగా కట్టించుకొన్న ఇంటిని వివి వినాయిక్ రూ. 20 కోట్లకు అమ్మేశాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఓ సీనియర్ కమిడియన్ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఆ కమిడియన్ వినాయక్ దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాడు. ఇది తెలిసిన వారు వినాయక్ వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగానూ నష్టపోయాడు చెప్పుకుంటున్నారు.


ఇంతకీ ఇందులో ఎంత వరకూ నిజం ఉందీ అనేది తెలియటం లేదు. ఆయనతో క్లోజ్ గా ఉండే సన్నిహితులు మాత్రం వినాయిక్ ఉన్న పరిస్దితుల్లో ఇల్లు అమ్మి అప్పులు తీర్చాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మెగా స్టార్ తో మరోసారి సినిమా చేస్తున్న ఆయన స్ధాయికి ఐదు కోట్ల కోసం అసలు అమ్మరు. తను తీసుకున్న మొత్తాన్నే వెనక్కి ఇస్తారు. కేవలం వాస్తు బాగోలేదని ఇంట్లో మార్పులు చేయిస్తున్నట్లు చెప్తున్నారు. ఏది నిజమో తేలాల్సి ఉంది.

English summary
VV Vinayak had to give some of his remuneration back to the distributors and Nithin already evaded some amount to him. To cover up these losses, he had to sell away his house in Hyderabad. The deal was reportedly sealed for 20 Crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu