»   » అగిన టైటిల్ లాగే ...నిజ జీవితంలోనూ దిల్ రాజు?

అగిన టైటిల్ లాగే ...నిజ జీవితంలోనూ దిల్ రాజు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దిల్ రాజు నిర్మాతగా రవితేజ హీరోగా "ఎవడో ఒకడు" సినిమాను ప్రారంభిచాడు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకుడు గా ప్రకటించారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, తరువాత కథ విషయంలో దిల్ రాజు, రవితేజలకు అభిప్రాయ బేధం రావటంతో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో నాగార్జున హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు.

ఇక "ఎవడో ఒకడు" టైటిల్ కు తగ్గట్లే నిజ జీవితంలోనూ దిల్ రాజు వ్యవహిస్తున్నాడని రవితేజ అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఖర్చుపెట్టి ప్రారంభించిన ప్రారంభించిన ఓ ప్రాజెక్టు ఆగిందంటే దాని వెనక పెద్ద రీజనే ఉంటుందనేది మాత్రం నిజం. మరి రవితేజ కాదన్న కథను నాగ్ అంగీకరిస్తాడో లేదో చూడాలంటున్నారు.

నాగార్జున విషయానికి వస్తే.. సంక్రాంతి బరిలో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో సూపర్ హిట్ కొట్టారు నాగార్జున. దాంతో ఆయన వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. ఈ విజయోత్సాహంలో గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయడానికే రెడీ అవుతున్నాడన్నాడు. ఇప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రానికి రెడీ అవుతున్న నాగ్ మరో కమర్షియల్ ఎంటర్ టైనర్ మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పుడీ చిత్రం లైన్ లోకి వచ్చింది.

గతంలో ఈ సినిమా గురించి దిల్ రాజు చేసిన ప్రకటన.... "రవి తేజ గారి తో భద్ర సినిమా తో సూపర్ హిట్ తీసాం. మళ్లీ ఇన్నాళ్ళకు ఆయనతో పని చేయటం, మా బ్యానర్ తో ఎంతో కాలం గా పరిచయం ఉన్న వేణు శ్రీ రామ్ తో, దేవి శ్రీ ప్రసాద్ తో పని చేయటం ఆనందం గా ఉంది" అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన తమ బ్యానర్ లో ఇది మరొక మంచి చిత్రం అవుతుంది అన్న నమ్మకాన్ని అయన వ్యక్త పరిచారు దిల్ రాజు. అవన్నీ ఉత్త కబుర్లు లాగ మిగిలిపోయినట్లే.

English summary
Dil Raju Want to produce the"Evado Okadu" film with another hero Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu