»   » ఇదే హాట్ టాపిక్ : పవన్ కు డిజాస్టర్ ఇచ్చిన ఆ డైరక్టర్ తో ఎన్టీఆర్?

ఇదే హాట్ టాపిక్ : పవన్ కు డిజాస్టర్ ఇచ్చిన ఆ డైరక్టర్ తో ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ తన సూపర్ హిట్ చిత్రం జనతాగ్యారేజ్ తర్వాత ఏ చిత్రము కూడా కమిటవ్వలేదు. కంటిన్యూగా స్క్రిప్ట్ లు వింటూనే ఉన్నారు. అయితే తాజాగా సిని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ఎన్టీఆర్ కు ఓ కథ నచ్చి ఓకే చేసారట. ఆ డైరక్టర్ ఎవరూ అంటే పవన్ కళ్యాణ్ తో రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ తో డిజాస్టర్ ఇచ్చిన బాబి. అయితే అతని అంతకు ముందు చిత్రం పవన్ హిట్ అవటం, అది ఎన్టీఆర్ కు నచ్చిన చిత్రం కావటంతో కథ విని, ఓకే చేసినట్లు సినీ వర్గాల సమాచారం.

అయితే ఎన్టీఆర్ మరికొంతమంది సీనియర్ డైరక్టర్స్ ..కథలు ఫైనల్ నేరేషన్ ఈ వారంలో వింటారని, వీటిల్లో తనకు అద్బుతమైన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు. సింగం దర్శకుడు హరి కూడా అందులో ఒకరట. బాబి కధ కానీ, హరి కథ గానీ ఏదో ఒకటి ఓకే అయ్యి, ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. నిజంగా బాబితో ఎన్టీఆర్ సినిమా ఓకే అయితే అతను లక్కీనే.

Director Bobby impresses NTR?

ఇక ఎన్టీఆర్‌ కొత్త సినిమా గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. 'జనతా గ్యారేజ్‌'తో దక్కిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఎన్టీఆర్‌ తదుపరి అందుకు ధీటైన కథలో నటించాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నట్టు తెలుస్తోంది. అయితే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఎన్టీఆర్‌తో సినిమా తీసే దర్శకులంటూ పూరి జగన్నాథ్‌, త్రివిక్రమ్‌ పేర్లు బలంగా వినిపించాయి. పూరి జగన్నాథ్‌ 'ఇజం' చూసిన తర్వాత ఎన్టీఆర్ నిర్ణయం మార్చుకున్నట్లు చెప్తున్నారు.

Director Bobby impresses NTR?

మరోపక్క త్రివిక్రమ్‌ 'అఆ' తర్వాత కథల్ని సిద్ధం చేసుకొంటున్నారు. ఆయన కూడా ఎన్టీఆర్‌కి కథ వినిపించారని ప్రచారం సాగింది. అయితే ఆయన పవన్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో బాబి కే ఎక్కువ శాతం గ్రీన్ సిగ్నల్ లభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్‌ మాత్రం అతి త్వరలోనే తన కొత్త సినిమాని ఖరారు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

English summary
Sardar Gabbar Singh Director Bobby has been traveling with NTR for a while now and he has reportedly impressed NTR with a very unique story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu