మారుతి కొత్త టైటిల్.. అందరికి కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా..
దర్శకుడు మారుతి మొదటి సినిమా నుంచి కూడా టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంటాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక చిన్న పాయింట్ ను హైలెట్ చేస్తుంటాడు. ప్రస్తుతం గోపిచంద్ తో ' పక్కా కమర్షియల్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది
చివరగా సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండగే అనే సినిమాతో వచ్చిన మారుతి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. వీలైనంత వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సింపుల్ పాయింట్స్ తోనే సినిమాలను తీసే మారుతి ఈసారి ఓటీటీ కంటెంట్స్ ను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సంగతి అటుంచితే విభిన్నమైన కథలను చేసి తన స్టూడెంట్స్ కు డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇప్పిస్తున్నాడు.

సంతోష్ శోభన్ కోసం ఒక కథను సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోంది. అయితే ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు ఒక విభిన్నమైన టైటిల్ ను సెట్ చేశారట. అందరికి అర్థమయ్యేలా 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ కరోనా రాకముందు.. కరోనా వెళ్లిపోయిన తరువాత.. అనే పాయింట్స్ తో రాసుకున్నట్లు సమాచారం. సినిమాలో కరోనాకు సంబంధించిన కామెడీ సీన్స్ ను కూడా బాగానే రాసుకున్నట్లు సమాచారం. మరి సినిమాతో సంతోష్ శోభన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











