మరోసారి రాజుగారి గదితోనే రానున్న ఓంకార్.. 2021బిగ్ ప్లాన్?
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలను అందుకోవాలని అప్పట్లో కొన్ని హారర్ కామెడీ మూవీస్ బాగానే తెరకెక్కించారు కొందరు దర్శకులు. కానీ ఆ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో ఎక్కువగా క్లిక్కవ్వడం లేదు. కాస్త రొటీన్ గా ఉన్నాయని అనిపించినా కొన్ని డిజాస్టర్స్ అవుతున్నాయి. కానీ ఓంకార్ మాత్రం రాజుగారి గది బ్రాండ్ తో మూడు పార్ట్ లతో మంచి లాభాలే అందుకున్నాడు. మొదట చేసిన రాజుగారి గది బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోవడంతో ఆ తరువాత నాగార్జున పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.
రాజుగారి గది 2 అనుకున్నంతగా అయితే సక్సెస్ కాలేకపోయింది గాని నాగార్జున, సమంతల స్టార్ డమ్ కారణంగా పెద్దగా నష్టాలు రాలేవు. ఇక మూడవసారి తమన్నాతో అనుకోని చివరికి అవికా గోర్ తో తెరకెక్కించారు. సినిమాకు ఒపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు ఓంకార్ మరోసారి అదే తరహాలో రాజుగారి గది 4వ సినిమాతో రానున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు తెలుగులో ఎవరు చేయని విధంగా హారర్ ప్లస్ కామెడీ జోనర్ లో ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేస్తున్న ఓంకార్ నాలుగవ సారి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఈ లాక్ డౌన్ లోనే ఓంకార్ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశాడని సమాచారం. ఇక తమ్ముడు అశ్విన్ బాబుని ఎప్పటిలానే ఒక ముఖ్య పాత్రలో ఉండేలా కథను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక కరోనా వైరస్ తగ్గిన అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ లో రెగ్యులర్ షుటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. 2021లోనే సినిమాను విడుదల చేయాలని ఓంకార్ ఒక స్పెషల్ ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











