Don't Miss!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- News
సెల్ఫీ వీడియో తీసుకుని బీజేపీనేత ఆత్మహత్య.. ఎన్నికల ఓటమి, వారి వేధింపులే కారణం!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఇంత జరిగినా పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరో చర్చలు.. త్వరలోనే అప్డేట్!
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల లైగర్ సినిమాతో దారుణమైన పరాజయాన్ని చూసిన విషయం తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ కాడమే కాకుండా పలు ఆర్థిక వివాదాలతో పూరి ప్రొడక్షన్ ను మరింత ఇబ్బంది పెట్టింది. ఈడీ అధికారులు కూడా లైగర్ సినిమాకు సంబంధించిన లావాదేవీలపై విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా ఆ విచారణలో పాల్గొన్నాడు.
అయితే పూరీ జగన్నాథ్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలైతే లైగర్ సినిమా తర్వాత వెంటనే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తోనే జనగణమన అనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ లైగర్ సినిమా డిజాస్టర్ కావడం వలన ఇప్పుడు ఆ ప్రాజెక్టు కొనసాగే అవకాశం అయితే లేదు. అయితే పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనే విషయంలో మరొక టాక్ వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ హీరోలతోను పూరి జగన్నాథ్ కు సినిమాలు చేసిన అనుభవం ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన ఫ్లాప్ లో ఉండడంతో కొంతమంది అగ్ర హీరోలు సినిమాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ మాత్రం పూరి జగన్నాథ్ కు సపోర్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి కథ ఉంటే చూడమని సినిమా చేద్దామని అతను సపోర్ట్ చేసినట్లు సమాచారం. ఈస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ తన పవర్ ఏమిటో చూపించిన పూరి లైగర్ సినిమాతో మాత్రం కాస్త తడబడ్డాడు.
అయితే ఇప్పుడు రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మరొక కథను సెట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఇక నేనింతే సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చివరగా వీరి కాంబోలో దేవుడు చేసిన మనుషులు అనే సినిమా వచ్చింది. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలని రవితేజ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే వీరి కాంబినేషన్ పై ఒక అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.