For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చాలా కాలం తరువాత మరో సినిమాకు ఆ వర్క్ చేసిన రాజమౌళి.. పాన్ ఇండియా హిట్ కోసమే..

  |

  దర్శకదీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా తనదైన శైలిలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాడు. అయితే తన ప్రమేయం ఉండగలిగే సినిమాలకు కూడా అయినా ఎంతో కొంత సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఇక మొదటిసారి ఒక బాలీవుడ్ సినిమాకు దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ సినిమాకు ఆయన కొంత వర్క్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  మహేష్ సినిమా

  మహేష్ సినిమా

  బాహుబలి, RRR సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకున్న దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు కథ రెడీ అయింది అని ఇక వీలైనంత త్వరగా ప్రాజెక్టుకు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్యలో ఆయనకు బ్రహ్మాస్త్రం పార్ట్ 1 సినిమాకు సంబంధించిన ఒక వర్క్ ఫినిష్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.

  జక్కన్న నమ్మకం

  దర్శకుడు అయాన్ ముఖర్జీ 2016 ప్రత్యేకంగా రాజమౌళిని కలిసినట్లు ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంతే కాకుండా రాజమౌళి కూడా అయాన్ ముఖర్జీ తనకు ఎప్పటి నుంచో తెలుసుని అతను చెప్పే కథలు అలాగే మేకింగ్ విధానం కూడా తనకు బాగా నచ్చుతుంది అని అన్నారు. అయితే ఇప్పుడు రాబోయే బ్రహ్మాస్త్ర సినిమా కూడా తప్పకుండా విజువల్ ట్రీట్ ని అందిస్తుంది అని జక్కన్న నమ్మకంతో తెలియజేశాడు.

  నెగిటివ్ టాక్..

  నెగిటివ్ టాక్..

  బ్రహ్మాస్త్రం సినిమాపై కొంత నెగిటివ్ టాక్ అయితే ఉంది. సినిమా ట్రైలర్ పై కూడా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కూడా జరిగింది. గ్రాఫిక్స్ అయితే కార్టూన్ తరహాలో ఉన్నాయి అని సినిమా ఏ మాత్రం ఆసక్తిని పెంచడం లేదు అని ఎంతోమంది కామెంట్ చేశారు. అయితే ఆ నెగటివ్ టాక్ ను తుడిచివేసే విధంగా చిత్ర యూనియ్ సభ్యులు ప్రమోషన్స్ బాగానే కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ మరోసారి దర్శకుడు రాజమౌళితో కలిసి సినిమా ఫైనల్ అవుట్ పుట్ పై ఒక నిర్ణయం కోరినట్లుగా తెలుస్తోంది.

  బ్రహ్మాస్త్ర కోసం ఎడిటింగ్

  బ్రహ్మాస్త్ర కోసం ఎడిటింగ్

  బ్రహ్మాస్త్ర సినిమాను ఇదివరకే రెండు మూడు సార్లు రాజమౌళి చూశాడు. చూసిన తర్వాతనే ఆయన సమర్పకుడిగా ఉండడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన సినిమాకు కొంత ఎడిటింగ్ వర్క్ అవసరమని ప్రత్యేకంగా దర్శకుడితో కూర్చుని మరి మళ్ళీ సినిమా సెకండ్ హాఫ్ లో కొంత మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. రాజమౌళికి ఎడిటింగ్ మీద చాలా మంచి పట్టు ఉంది ఎప్పుడు ఏ సన్నివేశం రావాలి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఎలివేషన్ వస్తుంది అనేది కూడా ఆయనకు బాగా తెలుసు.

  బోరింగ్ గా ఉందని..

  బోరింగ్ గా ఉందని..

  అయితే ఈ క్రమంలో సినిమా సెకండ్ హాఫ్ లో కొంత బోరింగ్ గా ఉంది అని అలాగే కొన్ని సన్నివేశాలకు సరైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పడలేదు అని మళ్ళీ దర్శకుడితో మాట్లాడి ఎడిటింగ్ చేయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని అనవసరమైన సన్నివేశాలు కూడా తొలగించినట్లు టాక్. డైరెక్టర్ రాజమౌళికి అపార అనుభవం ఉండడంతో ఆయన్ ముఖర్జీ మరో ఆలోచన లేకుండా జక్కన్న చెప్పిన పని చేసినట్లుగా సమాచారం. మరి రాజమౌళి ఇచ్చిన టిప్స్ ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

  English summary
  Director SS Rajamouli helped to Brahmastra part 1 movie final output
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X