»   » ఆర్య సుకుమార్ నెక్ట్స్ ఆ యువ హీరోతో కన్ఫర్మ్

ఆర్య సుకుమార్ నెక్ట్స్ ఆ యువ హీరోతో కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్యతో పరిచయమైన సుకుమార్ యూత్ చిత్రాలు తీయటంలో తనకుతానే సాటి అని జగడం, ఆర్య 2లతో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్ధలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం అనంతరం బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ చిత్రం చేయటానికి కమిట్ అవనున్నాడని సమాచారం. బాలకృష్ణతో విజయవంతమైన సింహా చిత్రాన్ని నిర్మించిన పరచూరి ప్రసాద్ ఈ కాంబినేషన్ కి తెర తీయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం మాటలు జరుగుతున్నాయి. అయితే ఫైనలైజ్ అయినట్లే నని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. స్క్రిప్టు కూడా ఓకే అయితే ఇక అతి త్వరలోనే ప్రకటించి షూటింగ్ కి వెళ్ళనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu