twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని జాతీయ అవార్డు: వివక్ష అంటూ వార్తలు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1991లో అక్కినేనిని వరించింది. తన జీవితకాలంలోనే అలాటి మరొక అవార్డును నెలకొల్పాలని అక్కినేని సంకల్పించారు. అన్నపూర్ణా స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను స్థాపించారు.

    ఈ సంస్థ 2005లో అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఎఎన్ఆర్ నేషనల్ అవార్డును నెలకొల్పింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు యావజ్జీవితం సేవ చేసిన, అసాధారణ విజయాలు సాధించిన వారికి ప్రతి ఏటా ఈ అవార్డును బహూక రిస్తున్నారు. మెమొంటో, పతకంతో పాటు ప్రారంభంలో అవార్డు గ్రహీతలకు అందించిన రూ. 3 లక్షల నగదు పురస్కరాన్ని తర్వాత 4 లక్షలకు, ప్రస్తుతం 5 లక్షల రూపాయలకు పెంచారు.

    Discrimination in Akkineni Awards?

    ఇప్పటి వరకు ఈ అవార్డులను పలువురు ప్రముఖులకు ప్రకటించారు. 2005లో నటుడు, రచయిత, దర్శకుడైన దేవానంద్, 2006 నటి షబానా ఆజ్మీ, 2007లో నటి, నిర్మాత అంజలీ దేవి, 2008లో నటి, నర్తకి, గాయని, కొరియోగ్రాఫర్ వైజయంతి బాలి, 2009లో నేపథ్యగాయని లతా మంగేష్కర్, 2010లో దర్శకుడు కె. బాలచందర్, 2011 నటి, దర్శకురాలు హేమమాలిని, 2012లో రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్, 2013లో నటి శ్రీదేవి ఈ అవార్డు అందుకున్నారు.

    అయితే ఈ అవార్డులు ప్రకటించే విషయంలో సెలక్షన్ కమిటీ వివక్ష చూపుతోందని, తెలుగు వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగులో కె.విశ్వనాథ్, బాపు లాంటి ప్రముఖులు ఉన్నా పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు పలువురి నుండి వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ఎంపిక కమిటీ ఎలా స్పందిస్తుందో?

    English summary
    The ANR National Award was instituted by the Akkineni International foundation in the honor of Akkineni Nageswara Rao. The award was given annually to recognize people for their lifetime achievements and contributions to the Indian film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X