»   » ఉదయ్ కిరణ్‌ జీవితంపై సినిమా, టార్గెట్ ఎవరు?

ఉదయ్ కిరణ్‌ జీవితంపై సినిమా, టార్గెట్ ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Documentary on Uday Kiran's Death
హైదరాబాద్: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో కలిచి వేసింది. ఉదయ్ కిరణ్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేని సినీ అభిమానులు ఎందరో. ఆయన మరణం ఎన్నో అసాధారణమైన అంశాలతో ముడి పడి ఉండటం ఇందుకు ఓ కారణమైతే, ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తుల కారణంగానే ఉదయ్ కిరణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారనే ప్రచారం కూడా మరో కారణం.

తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఉదయ్ కిరణ్ సినీ జీవితం, ఆత్మహత్యకు దారితీసిన అంశాలను బేస్ చేసుకుని ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కాలి సుధీర్ ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడటానికి........దారి తీసిన అంశాల వెనక ఓ పెద్దమనిషి హస్తం ఉందని పలువురు బహిరంగ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీలో ఏ చూపించబోతున్నారు అనే అంశం ఆసక్తి కరంగా మారింది. ఉదయ్ కిరణ్‌కు ఉన్న పాపులారిటీ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే....ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా 'దిల్ కబడ్డీ' త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఉదయ్‌ కిరణ్, జాస్మిన్ జంటగా నెక్కంటి ఆంజనేయస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ దర్శకత్వంలో వి.శివకుమార్ నిర్మించిన చిత్రం 'దిల్ కబడ్డీ'. ఫిబ్రవరి 5న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన వివారల్లోకి వెళితే....ఈ నెల 5న రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో......ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. తాను ఆశించినట్లు తన సినిమా కెరీర్ సాగక పోవడంతో మానసిక సంఘటర్షణకు లోనైన ఉదయ్ ఈచర్యకు పాల్పడ్డట్లు పోలసుల ప్రాథమిక విచారణలో తేలింది.

English summary

 Kaali Sudheer, director of Muse Art Gallery who has started Uday Kiran foundation has now coming up with a documentary on the Uday Kiran’s death for those who are suffering with depression.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu