»   » వివాదాస్పద నటుడితో ఎన్టీఆర్ ? : అక్కడ నిషేదం.... ఇక్కడ అవకాశం

వివాదాస్పద నటుడితో ఎన్టీఆర్ ? : అక్కడ నిషేదం.... ఇక్కడ అవకాశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరునెలల క్రితం కన్నడ సినీపరిశ్రమలో జరిగిన విషాదం గుర్తుందా..? మస్తిగుడి అనే సినిమా షూటింగ్ లో ఇద్దరు ఆర్టిస్టులు మరణించారు. సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే అనీ యూనిట్ నిర్లక్ష్యం కారణం గానే వాళ్ళిద్దరూ మరణించారనీ తేలింది దాంతో ఆసినిమాలో హీరో, నిర్మాణం లో భాగస్వామీ అయిన దునియా విజయ్ మీద తాత్కాలిక నిషేదం వేటు పడింది.

దునియా విజయ్

దునియా విజయ్

కన్నడ పరిశ్రమలో ఇప్పుడు విజయ్ కి అవకాశాల్లేవు. అందుకే ఇప్పుడు విజయ్ ఇతర పరిశ్రమల్లో అవకాశాలకోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు విజయ్ కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది అదీ టాలీవుడ్ లో... ఆ సినిమా ఏమిటో తెలుసా ఎన్టీఆర్ "జై లవకుశ" లో ముగ్గురు విలన్లలో ఇతన్నీ ఒక విలన్ గా తీసుకోనున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ రోల్ అని వినిపిస్తోంది అయితే ఈ రోల్ నెగెటివ్ గా ఉంటుంది తప్ప పూర్తి స్థాయి విలన్ కాదన్న మాట

జై లవ కుశ

జై లవ కుశ

నిన్ననే శ్రీరామనవమి సందర్భంగా ‘జై లవ కుశ' లోగో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ జోరు కూడా కొంచెం పెంచాలని ఫిక్సయ్యారు. ఈ సినిమా నెల రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ అవి చిన్న చిన్న సీన్లే. ఇంకా ఇద్దరు హీరోయిన్లను.. విలన్లను ఫైనలైజ్ చేయలేదు.

ఆర్టిస్టుల మరణం వివాదం లోనే కాదు

ఆర్టిస్టుల మరణం వివాదం లోనే కాదు

హీరోయిన్లుగా నివేదా థామస్, సమంతలను ఓకే చేసి.. విలన్ పాత్రల సంగతి కూడా తేల్చేసే పనిలో ఉన్నారు దర్శకుడు బాబీ.. ఇద్దరు ఆర్టిస్టుల మరణం వివాదం లోనే కాదు, గతంలో సెట్స్ లోనే ఒకరిపై చేయి చేసుకున్న కారణంగా కూడా దునియా విజయ్ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

వివాదాస్పద వ్యక్తి

వివాదాస్పద వ్యక్తి

ఈ రకంగా పలు వివాదాల్లో ఇరుక్కుని నటుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో. అంతలా వివాదాస్పద వ్యక్తిగా దునియా విజయ్ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మన ఎన్టీఆర్ ‘జై లవ కుశ' లో ప్రధాన విలన్ పాత్ర కోసం ఈయనను డైరెక్టర్ బాబీ సంప్రదించాడని తెలియడం ఇన్నర్ సర్కిల్ లో ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది.

దృవీకరించలేదు

దృవీకరించలేదు

ఇదే సమయంలో స్క్రిప్ట్ నచ్చడంతో పాటు తన పాత్ర కూడా బాగా నచ్చడంతో దునియా విజయ్ వెంటనే ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పేశాడని, దీంతో ప్రధాన విలన్ పాత్రకు ఇప్పుడు ఈయననే ఖరారు చేసేశారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే ఇంకా ఈ విషయం అధికారికంగా దృవీకరించలేదు...

English summary
Popular Kannada actor Duniya Vijay seemed the perfect choice for the role of the antagonist in the film Jai lavakusha With NTR
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu