»   »  '1-నేనొక్కడినే' నష్టాలు ఈరోస్ వి కాదా?

'1-నేనొక్కడినే' నష్టాలు ఈరోస్ వి కాదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం మార్నింగ్ షో నుంచీ నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని 72 కోట్లకు ఈరోస్ వారు కొంటున్నట్లు అఫీషియల్ గా నిర్మాతలు తెలిపారు. దాంతో నష్టాలు వారికే మొత్తం వెళ్తాయని అంతా భావించారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి వారు డబ్బు మొత్తం ఇచ్చి తీసుకోలేదట. కేవలం ఈ సినిమాకు ఫైనాన్సియల్ సపోర్ట్ చేసారని చెప్తున్నారు.

దాంతో ఈ చిత్రంపై వచ్చిన నష్టాలు నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్ధ వాళ్లవే అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చిత్రం అద్బుతంగా ఉందని అంటున్నా...కలెక్షన్స్ పై దాని ప్రభావం పడలేదు. దాంతో ఈ చిత్రం దాదాపు 25 కోట్లు దాకా నష్టపోయారని సినీ వర్గాల సమాచారం. శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ , ఓవర్ సీస్ బిజినెస్ అన్నీ కలుపుకున్నా షేర్ పాతిక కోట్లు వరకూ లాస్ అని చెప్తున్నారు.

Eros International support only to 'Nenokkadine'


అప్పటికీ నిర్మాతలు ఏదో విధంగా చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా '1' రైమ్‌ ('పీటర్‌ తాత స్టాట్యూకే బై బై బై... హంసల ఫ్రెండ్స్‌కి హాయ్‌ చెప్పేయ్‌... ట్రీస్‌ మధ్యన రోడ్డుంది రన్‌ రన్‌ రన్‌...' ) ని సైతం విడుదల చేసారు. ఇక మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో రాక్ స్టార్ గా నటించిన చిత్రం '1-నేనొక్కడినే'. మోడల్ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

సుకుమార్ మాట్లాడుతూ... సినిమాకి అన్ని చోట్ల నుంచీ రిపోర్టూ బాగుంది. విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. క్రమంగా టాక్ పికప్ అయ్యి ఇప్పుడు చాలా బాగుంది. ఓవర్సీస్‌లో మరింత ట్రెమండస్ రెస్పాన్స్ ఉంది. అక్కడ గ్రాండ్ సక్సెస్. ఒక్కోసారి ఆలోచింపజెయ్యడం కూడా ఆనందకర విషయం అవుతుంది. ఈ సినిమా సక్సెస్‌కి ఓ రకంగా అది కూడా కారణమే. ఇలాంటి ఆలోచింపజేసే సినిమా షార్ప్‌గా ఉండాలి. అందుకే 20 నిమిషాల నిడివి తగ్గించాం. ఇండస్ట్రీ మొత్తం నుంచి ఈ సినిమాకి సపోర్ట్ వచ్చింది. ఎన్నో కాల్స్ వచ్చాయి. రవితేజ, రామ్, నాని సహా చాలా మంది హీరోలు, రాజమౌళి, పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి సహా చాలా మంది డైరెక్టర్లు, చోటా కె. నాయుడు వంటి టెక్నీషియన్లు సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం జర్మన్, ఫ్రెంచి భాషల్లో డబ్బింగ్ చేసే ప్రక్రియ నడుస్తోంది. ఆ తర్వాత మరికొన్ని ప్రపంచ భాషల్లో డబ్ చేయబోతున్నాం అన్నారు.

English summary
'1', a loss of 25 Crore is evident straight event after all the satellite rights and audio rights prices are included.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu