»   » ఎక్సక్లూజివ్ : 'రామ్ చరణ్ బ్యానర్ కి పేరు ఫిక్స్

ఎక్సక్లూజివ్ : 'రామ్ చరణ్ బ్యానర్ కి పేరు ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం నిర్మించటానికి రామ్ చరణ్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ రిజిస్టర్ చేసి సినిమా చేయనున్నారు. ఈ బ్యానవర్ కు సురేఖా ఎంటర్ట్నెంట్ కానీ, లియో క్రియేషన్స్ గానీ, పెడతారని వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం...రామ్ చరణ్ ఎంటర్ట్నైమెంట్స్ అనే పేరుకే ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిరంజీవి 150 సినిమా కంటే ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సినిమా తెరకెక్కించనున్నారు. నితిన్ హీరోగా ఆయన సినిమా తీయనున్నారు. చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఆయన పుట్టినరోజు ఆగస్టు 22న ప్రారంభించనున్నారు. ఈలోపు నితిన్ తో సినిమా తీయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

EXCLUSIVE: 'Ram Charan Entertainments' Locked For Charan's New Banner

స్క్రిప్ట్ ఇప్పటికే ఒకే చేశారని, జూన్ 9న షూటింగ్ ప్రారంభించే అవకాశముందని తెలిపాయి. 50 రోజుల్లోపు షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నితిన్ సరసన కొత్త హీరోయిన్ నటించే అవకాశముంది. పూరి జగన్నాథ్ సొంత బేనర్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన 'హార్ట్ ఎటాక్' విజయవంతమైంది.

తాజాగా ఛార్మి ప్రధానపాత్రలో 'జ్యోతిలక్ష్మి' పేరుతో ఆయన సినిమా తెరకెక్కించారు. కాగా, 'ఆటోజానీ'లో పలు కీలక సన్నివేశాలు మార్చాలని చిరంజీవి సూచించడంతో పూరి జగన్నాథ్ రీవర్క్ చేస్తున్నారని చిత్రపురి సమాచారం. దాదాపు 20 సీన్లు వరకు మారుస్తున్నారని తెలుస్తోంది.

English summary
Ram Charan decided to lock a name for his production house and move the required formalities forward in a jet speed. Reports were pouring in in some section of media that 'Surekha Entertainments' or 'Leo Creations' will be the name of the banner for Charan's production house. However, going by some reliable sources close to the actor, none of them are under consideration for the title and Ram Charan is said to be keen on naming it as 'Ram Charan Entertainments
Please Wait while comments are loading...