»   »  హీరో రాజాని .. పవన్ ఫ్యాన్స్ చంపేసారు

హీరో రాజాని .. పవన్ ఫ్యాన్స్ చంపేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజకీయాల నేతలు పరిస్ధితి ఎలా ఉన్నా వారిని సపోర్టు చేస్తున్న సినిమా నటుల పరిస్ధితి దారుణంగా మారుతోంది. రీసెంట్ గా ఫేస్ బుక్ లో హీరో రాజా చనిపోయాడంటూ...రిప్ అంటూ వార్తలు మొదలయ్యాయి. యాక్సిడెంట్ లో చనిపోయాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఇదంతా కొంత మంది పవన్ దురాభిమానులు చేసిన పని తెలుస్తోంది. ఫేక్ గా న్యూస్ క్రియేట్ చేసి ప్రచారం చేయటం మీడియాలో చర్చనీయాంసంగా మారింది. ఈ విషయమై పవన్ నిజమైన అభిమానులు ఇలా చేయటం పద్దతి కాదంటున్నారు. దీనికి కారణం రాజా...రీసెంట్ గా వైయస్ ఆర్పీకు సపోర్టు చేస్తూ విరుచుకుపడటమే అంటున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కుట్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బలి కావడం ఖాయమని సినీ హీరో రాజా అన్నారు. గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకున్నట్టుగా, ఈ ఎన్నికల్లో పవన్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఎవరో ఒకరని వాడుకోవడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పవన్ కల్యాణ్ విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. పార్టీని తొలి రోజుల్లోనే పవన్ తాకట్టుపెట్టారన్నారు.

Face Book Comments on Pawan made Raja to die!!

టిడిపి, బిజెపి కూటమికి మద్దతు పలుకుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన నటుడు రాజా నిప్పులు చెరిగారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఎవరో రాసిచ్చిన స్ర్కిప్టులు చదువుతూ జగన్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చేతనైతే పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. పరిశ్రమలో జరుగుతున్న అన్యాయం గురించి పవన్ ఎప్పుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది అవసరానికి వాడుకుని వదిలేసే తత్వమన్నారు. గత ఎన్నికల్లో జూ ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను వాడుకుని వదిలేస్తారన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఓదార్చడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన ఒకే ఒక్క వ్యక్తి జగన్ అన్నారు.

English summary
Annoyed with the remarks, few of the Pawan Kalyan Fans are trending the news that the newly married Raja died in a road accident last night and RIP. The topic is trending in social networking sites- Facebook and Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu