twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ పై వచ్చిన వార్త పచ్చి అబద్దం

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ వంటి స్టార్ హీరోపై ఎప్పుడూ ఏదో ఒక వార్త పుడుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఆయన రెమ్యునేషన్ విషయమై మీడియాలో సంచలనంగా వార్తలు ప్రసారమయ్యాయి. ఆయన తన తాజా చిత్రం ఆగడు కి 18 కోట్లు ఛార్జ్ చేసాడని, తర్వాత చిత్రానికి మరో రెండు కోట్లు కలిపి ఇరవై కోట్లు తీసుకోనున్నాడని అన్నారు. అయితే అదంతా అబద్దం అంటున్నారు. ఆయన ఆగడు నిర్మాతల నుంచి అంత వసూలు చేయలేదని కారణం చెప్తున్నారు.

    మహేష్ మాటపై నమ్మకంతో ఆగడు నిర్మాతలు తమ ముందు చిత్రం 1 నేనొక్కిడినే పై భారీగా పెట్టారని,అయితే అది పెద్ద ఫ్లాఫుగా భాక్సాఫీస్ వద్ద నమోదు కావటంతో,మహేష్ ఆ లాస్ ని రికవరీ చేసే నిమిత్తం ఆగడు కి రెమ్యునేషన్ చాలా తక్కువ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కాబట్టి 18 కోట్లు రెమ్యునేషన్ అనేది నమ్మవలసిన పనేమీలేదని తెలుస్తోంది. ఆగడు చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే ఆగడు కి రెమ్యునేషన్ ఎంత తీసుకుంటున్నాడు అనేది మాత్రం సీక్రెట్ అంటున్నారు.

    False news about Mahesh Babu remunation

    'ఆగడు' చిత్రాన్ని దసరా ఉత్సవాల ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 26 న విడుదల చేయాలనే ఫిక్స్ అయినట్లు అంతర్గత వర్గాల సమాచారం. అలాగే ఆగస్టు 31న ఈ చిత్రం ఆడియోని గ్రాండ్ గా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్,బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

    ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    Mahesh is not charging 18 cr for Aagadu as the actor is actually compensating some of the losses of his previous film 1 Nenokkadine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X