»   » అప్పుడు మహేశ్‌కు.. ఇప్పుడు బాలయ్యకు పూరి షాక్.. టైటిల్ ఇదేనంటా..

అప్పుడు మహేశ్‌కు.. ఇప్పుడు బాలయ్యకు పూరి షాక్.. టైటిల్ ఇదేనంటా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో ఎవరైనా సరే.. సినిమాకు టైటిల్స్ పెట్టడంతో దర్శకుడు పూరి జగన్నాధ్‌కు టాలీవుడ్‌లో ఎవరూ సరితూగదు. గతంలో మహేశ్‌బాబుకు పూరి కథ చెప్పి ఈ సినిమా టైటిల్ పోకిరి అనిచెప్పడంతో ప్రిన్స్ కంగుతిన్నాడట. టైటిల్‌ బాగుంటుందా అనే అని మహేశ్ అడిగితే ఒక్కసారి ఫిక్సైతే నా మాట వినను అనే రేంజ్‌లో అదే టైటిల్‌తో పూరి ముందుకెళ్లాడు. మహేశ్ కెరీర్‌లోనే దిమ్మతిరిగే హిట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా శివమణి, టెంపర్ లాంటి టైటిల్స్‌తోనే కాకుండా కథతో ప్రేక్షకులకు పిచ్చెక్కించాడు.

తనదైన శైలిలో..

తనదైన శైలిలో..

తాజాగా యువరత్న బాలకృష్ణతో పూరి సినిమా అంటే సినీ వర్గాలే కాదు. అభిమానులు కూడా షాక్ తిన్నారు. బాలయ్యబాబు, పూరి కాంబినేషన్ అని పెదవి విరిచిన వాళ్లను పట్టించుకోకుండా పూరీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. శరవేగంగా షూటింగ్‌ను తనదైన శైలిలో పూర్తి చేస్తున్నాడు.

 టైటిల్ ఏంటీ..

టైటిల్ ఏంటీ..

ఇక పూరి, బాలయ్య సినిమా టైటిల్ ఏంటీ అనే ప్రశ్న అప్పుడే మొదలైంది. రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ‘టపోరి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు జోరుగా ప్రచారమవుతున్నది. అయితే బాలయ్య, పూరీ కాంబినేషన్‌లో సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనే ఆసక్తితో అటు పరిశ్రమ వర్గాలు, ఇటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

పవర్ ఫుల్ టైటిల్

పవర్ ఫుల్ టైటిల్

టైటిల్ తోనే సినిమాపై సగం హైప్స్ తీసుకొచ్చే పూరీ తన తాజా చిత్రానికి కూడా పవర్ ఫుల్ టైటిల్ పెట్టాడని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావల్సి ఉంది.

తేదీ నుంచి యూరప్‌కు

తేదీ నుంచి యూరప్‌కు


గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత 101 చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం యాక్షన్ పార్ట్‌ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని తదుపరి షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 7 తేదీ వరకు లండన్‌లో షెడ్యూల్ జరుపుకోనున్నది.

English summary
Director Puri Jagannadh is doing a crazy project with Actor Balakrishna. For this movie Tapori title under consideration. Official announcement will come soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu