twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రామయ్యా వస్తావయ్యా' ఆడియోకి ఫ్యాన్స్ కి నో??

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్‌ కూడా దసరా సంబరాలను మరింత పెంచడానికి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో ఈ వారంలోనే వస్తుందని దిల్ రాజు ఖరారు చేసారు. ఈ నేపధ్యంలో ఈ ఆడియోకు ఫ్యాన్స్ హంగామా ఉంటుందా ఉండదా అనేది క్వచ్చిన్ మార్క్ గా మారింది. ఎందుకంటే బాద్షా ఆడియో సమంయంలో జరిగిన విషాదం అందరికి గుర్తుకు వస్తోంది. అయితే దిల్ రాజు ..నందమూరి అభిమానుల సమక్షంలోనే విడుదల చేస్తాం అంటున్నారు. అంటే ప్రత్యేకమైన జాగ్రత్తలతో కూడిన ఏర్పాట్లు చేస్తున్నారా అంటున్నారు.

    ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' ఆడియో వేడుకల్లో ఆపశృతి చోటు చేసుకుంది. మణికొండలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకలు ఏర్పాటయ్యాయి. ఈ వేడులకు జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్‌లోని ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని ఊపిరి ఆడక మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని కొండాపూర్ ఆస్పత్రిలో ఉంచారు. దాంతో అది రాష్ట్రంలో వివాదాంశంగా మారింది.

    'బాద్ షా' ఆడియో వేడుకల్లో తొక్కిసలాట జరిగి, అభిమాని మృతి చెందడంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనిది ఈసారి ఇలా ఎందుకు జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే అభిమాని మృతి చెందడంతో తోటి అభిమానులు ఆయన మృతికి సంతాపంగా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. దీంతో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంఆడియో పంక్షన్ ని ఎలా ప్లాన్ చేస్తారు...ప్యాన్స్ కు ఆహ్వానం ఉందా లేదా అనేది అందరిలో ఆసక్తికరమైన చర్చగా మారింది.

    నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ''మా సంస్థకు అక్టోబరు నెల కలిసొచ్చింది. కొత్తబంగారులోకం, బృందావనం సినిమాలు ఈ నెలలోనే విడుదల చేశాం. ఇప్పుడు 'రామయ్యా...' కూడా వచ్చేస్తున్నాడు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ వారంలోనే పాటల్ని నందమూరి అభిమానుల సమక్షంలో విడుదల చేస్తున్నాము '' అన్నారు. సమంత హీరోయిన్. శ్రుతిహాసన్‌ కీలక పాత్రధారి. తమన్‌ స్వరాలు అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేయనున్నారు.

    English summary
    Makers of Ramayya Vasthavayya movie are planning to release its audio this week and its heard that fans are been avoided intentionally for audio launch. Rewinding the incident of a fan died in the audio function of Baadshah this decision is taken.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X