»   » అమెరికాలో రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్!

అమెరికాలో రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్, ఐపీఎల్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతి జింతా పెళ్లి గురించి గత కొంతకాలంగా మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆమె ఆ వార్తలను ఖండిస్తూనే వస్తున్నారు. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆమె తన అమెరికన్ బాయ్ ఫ్రెండ జీని గుడెనఫ్ ను పెళ్లాడినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రీతి జింతా క్లోజ్ ఫ్రెండ్స్ సుజానె ఖాన్(హృతిక్‌ రోషన్ మాజీ భార్య), సురిలీ గోయెల్ కూడా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉండటంతో....ప్రీతి జింతా పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ప్రీతి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకే వారు అక్కడికి వెళ్లినట్లు సమాచారం.

Finally, Preity Zinta Gets Married In A Private Ceremony In LA

పెళ్లి రహస్యంగా చేసుకున్నా రిసెప్షన్ మాత్రం తన హోదాకు తగిన విధంగా గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. పెళ్లి తర్వాత నెల రోజుల పాటు అమెరికాలోనే హనీమూన్ ఎంజాయ్ చేయడానికి ఈ జంట ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. హనీమూన్ ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో బాలీవుడ్ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీని గడెనఫ్ తో ప్రీతి జింతా గత 18 నెలలుగా డేటింగ్ చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కూడా అతను ప్రీతి జింతాతో కనిపించాడు.

అయితే జనవరిలో ప్రీతి జింతా, జీని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్త లొచ్చాయి. ఆ వార్తలపై అప్పట్లో ప్రీతి జింతా తీవ్రంగా మండి పడింది. తన పెళ్లి వార్తలను ఒక రూమర్ గా కొట్టిపారేసింది. ఇపుడు పెళ్లి జరిగిన విషయం ఆమెగానీ, ఆమె సన్నిహితులుగానీ అఫీషియల్ గా బయట పెట్టలేదు. అమ్మడు ఈ సారి సైలెంటుగా ఉంటే పెళ్లి జరిగిన వార్త నిజమే... ఒక మళ్లీ ఎప్పటిలాగే మీడియాపై భగ్గు మంటే మాత్రం...కాలేదని అర్థం చేసుకోవాలి.

English summary
Yes, you read it right! Our favourite actress preity Zinta is married now. According to Filmfare, the actor tied the knot with her long time boyfriend Gene Goodenough in a private ceremony in LA. Preity Zinta's close friends Sussanne Khan and Surily Goel are in LA too, to attend the wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu