»   » ఇంత లేటా? పవన్ కళ్యాణ్ జీ ఇలా చేస్తున్నారేంటి?

ఇంత లేటా? పవన్ కళ్యాణ్ జీ ఇలా చేస్తున్నారేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం 'గబ్బర్ సింగ్-2'. ముందుగా అనుకున్న ప్రకారం ఈచిత్రం షూటింగ్ డిసెంబర్లోనే మొదలు కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం మరింత ఆలస్యంగా ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం స్క్రిప్టు వర్కు ప్రధాన కారణం అయితే....హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా జాప్యం జరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాలు కూడా మరో కారణమని తెలుస్తోంది. అయితే బయటకు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి.

G-2: Pawan Kalyan still taking time

కాగా..గబ్బర్ సింగ్-2లోని డైలాగులు అంటూ నెట్లో కొన్ని డైలాగులు హల్ చల్ చేస్తున్నాయి. 'నేను టెంపర్ లాస్ అయితే...టెంపో లేకుండా కొడతా', 'ఫస్ట్ పార్టులో నా తిక్కకి లెక్క ఉందిరోయ్...ఈ పార్టులో లెక్కే లేదు' అనే డైలాగులు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవి నిజంగానే సినిమాలోని డైలాగులేనా? కాదా? అనేది తేలాల్సి ఉంది.

గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
Film Nagar buzz is that, Gabbar Singh 2 script is ready, but Pawan Kalyan is still taking time to start shooting for the film because the lead actress hasn’t been finalized yet. May be Gabbar Singh 2 to go on floors in next month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu