»   »  హాట్ న్యూస్ : ‘గబ్బర్ సింగ్ 2′ లాంచింగ్ డేట్

హాట్ న్యూస్ : ‘గబ్బర్ సింగ్ 2′ లాంచింగ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న 'గబ్బర్ సింగ్ 2′ కు ముహూర్తం డేట్ ఖరారైందని సమాచారం. ఈ సినిమా సెప్టెంబర్ 20 న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు.

ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం.


మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈమేరకు దీపిక తో చర్చలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. రీసెంట్ గా చెన్నై ఎక్సప్రెస్ సూపర్ హిట్ తో మంచి జోర్ మీదఉ న్న దీపిక చాలా ఎక్కువ రెమ్యునేషన్ చెప్తోందని వినికిడి. అయితే ప్రాజెక్టుకి బాగా క్రేజ్ వస్తుందని ఆమెనే తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంతకుముందు సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈచిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సమైక్యాంధ్ర ఉద్యమకారులు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించడంతో విడుదల వాయిదా వేసారు.

English summary
Pawan Kalyan's new film, Gabbar Singh 2, sequel to the blockbuster Gabbar Singh, will be launched formally on September 20th. The film's script work has come to an end, so this muhurtham has been decided, sources informed us. 'Rachcha' fame Sampath Nandi is directing this entertainer. Pawan Kalyan's close friend Sharat Marar is producing this film. Heroine is yet to be finalized. Devi Sri Prasad will provide the music.
Please Wait while comments are loading...