»   » రూమర్స్ ఆపటానికే పవన్ కళ్యాణ్ అలా...

రూమర్స్ ఆపటానికే పవన్ కళ్యాణ్ అలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోపై,అతని పర్శనల్ లైప్, ప్రొఫెషినల్ లైఫ్ పై అనేక రూమర్స్ వస్తూంటాయి. అయితే ఈ మధ్యన 'గబ్బర్‌సింగ్‌ 2'సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వచ్చాయి. దాన్ని ఖండించటం కన్నా ఓపినింగ్ పెట్టి సినిమా ప్రారభించటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చే పూజ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎందుకంటే చిత్రం ముహూర్తం జరిగినా షూటింగ్ మే నెల నుంచి మాత్రమే జరగనుంది. దసరాకు సినిమాని రిలీజ్ చేస్తారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమాకి సంబంధించిన కథ, రచన వ్యవహారాలన్నీ పవన్‌కల్యాణ్‌ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఓ కొత్త కథతో రూపొందుతున్న ఈ సినిమాను మేలో సెట్స్‌పైకి తీసుకెళతాం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది అంటూ 'గబ్బర్‌సింగ్‌'గా పవన్‌ కల్యాణ్‌ ప్రేక్షకులకు వినోదం పంచారు. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'గబ్బర్‌సింగ్‌ 2' తెరకెక్కుతుందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అభిమానులు కూడా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే... అది 'గబ్బర్‌సింగ్‌'కి కొనసాగింపు కాదట. కొత్త కథతో తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం.

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'గబ్బర్‌సింగ్‌ 2' చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచనా పర్యవేక్షణ: సత్యానంద్‌, క్రియేటివ్‌ హెడ్‌: హరీష్‌పాయ్‌, రచనా సహకారం: శ్రీధర్‌ సీపాన, కిషోర్‌ గోపు, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

ఇక 'అత్తారింటికి దారేది' తరవాత పవన్‌ కల్యాణ్‌ సినిమా ఏదీ సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ కొత్త సినిమా కబుర్లు చాలానే వినిపిస్తున్నాయి. కొత్త కథలు పవన్‌ వింటున్నారు. పవన్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్‌ పచ్చజెండా వూపింది రెండు సినిమాలకే. 'గబ్బర్‌ సింగ్‌ 2'తో పాటు, 'ఓ మైగాడ్‌' తెలుగు రీమేక్‌ని ఒప్పుకొన్నారు.

'ఓ మైగాడ్‌'లో వెంకటేష్‌తో కలసి వెండితెరను పంచుకోనున్నారు. ఈ రెండు చిత్రాలూ ఇంచుమించు ఒకేసారి చిత్రీకరణ జరుపుకోనున్నాయి. త్వరలోనే 'గబ్బర్‌ సింగ్‌ 2' సెట్స్‌పైకి వెళ్లనున్నదని నిర్మాత శరత్‌మరార్‌ చెబుతున్నారు. 'ఓ మైగాడ్‌' తెలుగు రీమేక్‌కీ ఈయనే నిర్మాత. సురేష్‌ బాబుతో కలిసి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 'గబ్బర్‌సింగ్‌ 2', 'ఓ మైగాడ్‌' తెలుగు రీమేక్‌ ఈ రెండు సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొద్ది రోజుల్లో ప్రకటిస్తారు.

English summary
Putting full stop to all other rumours in circulation about Pawan Kalyan's 'Gabbar Singh 2' project, the makers have given a strong statement that Pawan is not retracting from his plan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu