Just In
- 1 hr ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 2 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 2 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
- 3 hrs ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి
- Finance
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువ
- Sports
ఐసీయూలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్!!
- Automobiles
కవాసకి బైక్స్‌పై జనవరి 2021 ఆఫర్స్; భారీ డిస్కౌంట్స్
- Lifestyle
మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ప్రతి ఉదయం దీన్ని తాగితే సరిపోతుంది ...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR నుంచి అదిరిపోయే అప్‌డేట్: ఎన్టీఆర్ కోసం విప్లవ వీరుడి సహాయం కోరిన రాజమౌళి.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో RRR ఒకటి. దీనికి 'బాహుబలి' సిరీస్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడం ఒక కారణం అయితే, టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడం మరో కారణం. అలాగే, ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతుండడంతో సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్?

విప్లవ వీరులను ఇలా చూపిస్తున్నాడు
ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఇద్దరు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల కథతో తెరకెక్కుతున్న చిత్రమే RRR. పోరాటాలు చేయడానికి ముందు ఈ ఇద్దరి జీవితాలకు సంబంధించి ఊహాజనితమైన అంశాలను జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. అందుకే ఇది ఫిక్షనల్ డ్రామా అని ముందుగానే వెల్లడించాడు.

వాళ్లిద్దరు.. వాళ్ల కోసం అక్కడి అమ్మాయిలు
ఈ సినిమాలో ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రను, రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌ను చేస్తున్నారు. వీళ్లకు జోడీగా బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లను తీసుకొచ్చాడు రాజమౌళి. ముఖ్యంగా తారక్ హీరోయిన్‌గా లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఆడిపాడనున్నారు.

చాలా వరకు అయింది.. అసలైంది మిగిలింది
RRR సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందని చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా వెల్లడించింది. మిగిలిన భాగం కోసం విశాఖపట్నం మన్యంలో షూటింగ్ జరుపుతున్నారు. ఇందులోనే కీలకమైన పోరాటలతో పాటు క్లైమాక్స్ సీన్ కూడా షూట్ చేస్తారని సమాచారం.

ముందు ప్రకటించింది కాదని అంటున్నారు
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈ సినిమాను పది భాషల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండడమేనన్న టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ కోసం విప్లవ వీరుడి సహాయం
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ పాత్ర అయిన కొమరం భీమ్ కోసం విప్లవ కవి గద్దర్‌ను ఓ పాట రాయమని కోరాడట రాజమౌళి. భీమ్ తెలంగాణకు చెందిన వీరుడు కావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. రాయడం మాత్రమే కాదు.. పాట కూడా గద్దరే పాడనున్నారని తెలుస్తోంది.

ఆ పాట ఆయనకు అవార్డును తెచ్చి పెట్టింది
గద్దర్ గతంలో పలు సినిమాలకు పాటలు అందించడంతో పాటు పాడారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో విడుదలైన ‘జై బోలో తెలంగాణ సినిమా కోసం ఆయన ‘పొడుస్తున్న పొద్దు మీద' అని పాడిన పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఉద్యమం సమయంలో ఊపు ఊపింది. అలాగే, ఆయనకు పలు అవార్డులు తెచ్చి పెట్టింది.