twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జనతా గ్యారేజ్: తెలంగాణలో గుడ్ న్యూస్, ఏపీలో బ్యాడ్ న్యూసా... నిజమేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' చిత్రానికి తెలంగాణలో గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ లో బ్యాడ్ న్యూస్. ముఖ్యంగా ఏపీలో ఉండే ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేని చేదు వార్త. ఈ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలో ఏపీలో ఉండే అవకాశం లేదంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    జనతా గ్యారేజ్‌కు సంబంధించి అక్కడ ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండబోవు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని, సెప్టెంబరు 1న అర్ధరాత్రి, వేకువజామున వేసే షోలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది.

    ఇప్పటికే విజయవాడకు చెందిన కొందరు జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో హక్కులను రూ.25 లక్షలు పెట్టి దక్కించుకోవడంతో వారిలో ఆందోళన నెలకొన్నట్లు గాసిప్స్ గుప్పుమన్నాయి. మరో వైపు తెలంగాణలో బెనిఫిట్ షోలకు ఎలాంటి ఇబ్బంది లేదని, హైదరాబాద్‌లో బెనిఫిట్ షో హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ రూ.70 లక్షలకు కొనుగోలు చేసిందని టాక్. కూకట్‌పల్లి, దిల్‌సుఖ్ నగర్ ఇతర ప్రాంతాల్లోని థియేటర్లలో ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేయబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    అంతే కాదు... ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం కూడా జనతా గ్యారేజ్ చిత్రానికి నష్టం కలిగించే విధంగా ఉంది. అందుకు సంబంధించిన విషయాలు స్లైడ్ షోలో..

    పోస్టర్లపై నిషేదం

    పోస్టర్లపై నిషేదం

    సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని పట్టణాలు దగ్గర నుంచి పల్లెటూర్ల వరకు గోడల పై పోస్టర్లు అంటించే విధానాన్ని నిషేధించిందంట.

    తొలు నష్టపోయేది ఈ సినిమానే

    తొలు నష్టపోయేది ఈ సినిమానే

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మొట్టమొదటిగా నష్టపోతున్నది ‘జనతా గ్యారేజ్' మూవీ అని అంటున్నారు. ఎందుకంటే అదే రోజు జనతా గ్యారేజ్ చిత్రం రిలీజవుతోంది.

    పోస్టర్లు లేకుంటే కష్టమే.

    పోస్టర్లు లేకుంటే కష్టమే.

    ఎన్టీఆర్ సినిమాలకు బిసి సెంటర్లలో కలక్షన్స్ బాగా వస్తాయి. ఇలాంటి థియేటర్లన్నీ ఎక్కువగా పల్లెలు, చిన్నస్థాయి పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటాయి. బిసి సెంటర్ల ప్రేక్షకులకు సినిమా చేరాలంటే వాల్ పోస్టర్ల ప్రచారమే కీలకం.

    అనుమానాలు?

    అనుమానాలు?

    సినిమా రిలీజ్ రోజే ఇలా జరుగుతుండటంతో ఏదైనా ఎవరైనా కావాలని కుట్ర చేసారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    గతంలో కూడా..

    గతంలో కూడా..

    గతంలో విడుదలైన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో' సినిమా సమయంలో కూడా కొన్సి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ధియేటర్లు దొరకకుండా టాలీవుడ్ లోని ఒక వర్గం ప్రయత్నించినే ఆరోపణలు న్నాయి.

    నిజమేనా?

    నిజమేనా?

    అయితే బెనిఫిట్ షోలో రద్దు చేస్తూ జీవో జారీ అయినట్లు ఎలాంటి అపీషియల్ సమాచారం లేదు. ఏపీ అధికారిక వెబ్ సైట్లో కూడా జీవో జారీ అయినట్లు లేదు.

    English summary
    GO news on Janatha Garage, is it true?. Few media reports that AP government had issued a Government Order against the benefit shows of films and reports that it would affect the openings of NTR's forthcming release Janatha Garage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X