twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ' గోపాలగోపాల' ఆడియో మళ్లీ ఫోస్ట్ ఫోన్?

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ' గోపాలగోపాల ' . ఈ చిత్రం ఆడియోని జనవరి 1న శిల్ప కళా వేదికలో విడుదల చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయితే ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ ఆడియో వేడుక వాయిదా పడిందని చెప్పుకుంటున్నారు. సాంగ్ షూటింగ్ లో యూనిట్ బిజీగా ఉండటంతో దాన్ని జనవరి 3 వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పుకుంటున్నారు. అలాగే ...రామానాయుడు సినీ విలేజ్ , నానక్ రామ్ గూడాలో ఈ వేడుక జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అథికారిక సమాచారం ఏమీ లేదు.

    మరో ప్రక్క విడుదలకు సమయం దగ్గర పడుతూండటంతో బిజినెస్ ఊపందుకుంది. ఈ చిత్రం నైజాం రైట్స్ ను 13.4 కోట్లకు NRA పద్దతిలో అమ్మినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. ఇక పవన్‌కళ్యాణ్‌కు నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్‌ అంతాఇంతాకాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బద్దలు కొడుతుంటాయి. 'గబ్బర్‌సింగ్‌' అక్కడ 17 కోట్లు వసూలు చేసిరికార్డు క్రియేట్‌ చేస్తే, తర్వాత వచ్చిన 'అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్‌ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'గోపాల గోపాలకి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని విశ్వసనీయ సమాచారం.

    ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నడిపే బైక్ కు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బైక్ తోనే పోస్టర్స్ నిసైతం విడుదల చేసారు. తాజా సమాచారం ఏమిటంటే..ఆ బైక్ ని ప్రీమియర్ షో కు ప్రదర్శనలో పెడతారని తెలుస్తోంది. ఆ షోలో ఆ బైక్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Gopala Gopala Audio Postponed Again?

    బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు.

    శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

    ఇక గోపాల గోపాల సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రంలో సాంగ్స్‌ లేకుండా చేద్దామనుకున్నా సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా మూడు పాటలు ప్లాన్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ టాక్‌. అయితే వీటిలో ఒక పాట మాత్రం వెంకటేష్‌, పవన్‌ల మధ్య సాగుతుందనే వార్తలు వచ్చాయి. మరో మూడు పాటలు చరణాలు మాత్రమే వినబడి బిట్స్‌ లాగా అనిపిస్తాయంట.

    మరీ వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే జనవరి (విడుదల) వరకు ఆగాల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ వారణాసిలో చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో కూడా ఎవరి ఊహకు అందనంతంగా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

    చిత్రం కథ విషయానికి వస్తే..

    దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

    ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

    English summary
    The audio launch of Pawan Kalyan's Gopala Gopala has been postponed once again. latest buzz indicates that the audio release would take place on January 3 (Saturday).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X